సుందర గోవిందుడు ఆలయ ప్రాంగణంలో ని గోశాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

 


కొవ్వూరు (ప్రజా అమరావతి); 


సుందర గోవిందుడు ఆలయ ప్రాంగణంలో ని గోశాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి  పేర్కొన్నారు. 


.

శనివారం స్థానిక సుందర గోవిందుడు ఆలయానికి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్, తదితరులతో కలసి ఆయన విచ్చేసి వేంకటేశ్వరస్వామి వారిని  దర్శనం చేసుకోవడం జరిగింది . ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కొవ్వూరు సుందర గోవిందుడు ఆలయ ప్రాంగణంలో 60 గోవులతో సంప్రదాయ పద్దతిలో గోశాలని నిర్వహిస్తున్న, ప్రతినెలా నిర్విఘ్నంగా పూజలు చేస్తున్న  సుందర సూర్య రామ సుబ్రహ్మణ్యం ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. హిందు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తనవంతు కృషి ని చేస్తున్నందుకు ఆయన్ని అభినందించారు. ఈ ఆలయ లోని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ని గోశాలకి టిటిడి దేవస్థానం తరపున సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు.


ఈ పర్యటన లో ఎంపి మార్గాని భరత్ రామ్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, జి. శ్రీనివాస్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.