శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి)


      దేవస్థానము మహామండపము 6 వ అంతస్తు నందు  ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశము నిర్వహించి పలు అంశాలపై చర్చించి తీర్మానం చేయడం జరిగినది. సమావేశము అనంతరము, సమావేశం నందు చర్చించిన  అంశములు, మరియు భవానీ దీక్ష విరమణల(25-12-2021 to 29-12-2021)సందర్భముగా విచ్చేయు భక్తులు తీసుకోనలవసిన జాగ్రత్తలు మరియు భవానీ భక్తుల సౌకర్యం నిమిత్తం దేవస్థానం తరపున చేస్తున్న ఏర్పాట్లు, మరియు ఇతర అంశముల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమము నందు పాలక మండలి సభ్యులు శ్రీ లింగంభొట్ల దుర్గాప్రసాద్ , శ్రీ కే.వెంకటరమణ(బాల), శ్రీమతి నేలపట్ల అంబిక , శ్రీ మతి పులి చంద్ర కళ , శ్రీమతి కే.రాజ్యలక్ష్మి గ, శ్రీ మతి కటకం శ్రీదేవి , శ్రీమతి నేతికొప్పుల సుజాత , శ్రీమతి బుసిరెడ్డి సుబ్బాయమ్మ , శ్రీ గంటా ప్రసాద్ రావు , కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీ DV భాస్కర్ , ఉప కార్యనిర్వహక ఇంజనీరింగ్ వారు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.