ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ చేయాలి : సీఎం*కోవిడ్‌ నియంత్రణ, నివారణ వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


అమరావతి (ప్రజా అమరావతి);

*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్ ఏమన్నారంటే..:*

కోవిడ్‌ వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలి : అధికారులకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం

ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు రంగంలోని ఆస్పత్రులుకూడా దీనికి సిద్ధంగా ఉండాలన్న సీఎం


వ్యాక్సినేషన్‌ ఉద్ధృతంగా చేయాలని సీఎం ఆదేశం

ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ చేయాలి : సీఎం

ఫీవర్‌ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్‌ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలన్న సీఎం


13 జిల్లాల్లో 98.96శాతం మొదటి డోస్‌ టీకాలు వేసిన ఆరోగ్యశాఖ

71.76శాతం రెండో డోస్‌ వేసిన ఆరోగ్యశాఖ

నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, ప.గో, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌

కడపలో 98.93, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూ.గో 97.43, కృష్ణా 97.12, శ్రీకాకుళంలో 96.70 శాతం మేర మొదటి డోస్‌.


కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశం

ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపైన, వృద్ధులపైన బూస్టర్‌డోస్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం


15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్‌ డోస్‌ అవసరమని ప్రాథమిక అంచనావేశామన్న అధికారులు


*కోవిడ్‌ నివారణ, నియంత్రణ, తాజా కేసులుపై సీఎంకు నివేదిక అందించిన అధికారులు.*

రాష్ట్రంలో 6 ఒమిక్రాన్‌ కేసులున్నాయని తెలిపిన అధికారులు

వీరిలో ఎవ్వరూ కూడా ఆస్పత్రిపాలు కాలేదన్న అధికారులు

అధికారులు ఇచ్చిన వివరాలు ప్రకారం భయాందోళన అవసరంలేదు: సీఎం

అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి:

రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాలనుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలి: సీఎం

డేటాను పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన నిర్ణయాలు తీసుకోవాలి:


*టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ*

క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్‌ సర్వే తప్పనిసరిగా జరగాలి:సీఎం

కోవిడ్‌ నివారణలో ఇది మంచి యంత్రాంగం:

టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతులలో పోవాలి:

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలి:

సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలి:

వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామన్న సీఎం


విదేశాలనుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు  వారిని ట్రేస్‌ చేయాలన్న సీఎం

ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు చేయాలన్న సీఎం

వారికి క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా పరీక్షలు జరపాలన్న సీఎం

పాజిటివ్‌ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్‌కు కూడా వెంటనే పరీక్షలు చేయాలన్న సీఎం


*ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం*

రాష్ట్రంలో కొత్త మెడికల్‌కళాశాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం

ఇవి పూర్తయితే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్న సీఎం

మెడికల్‌సీట్లు పెరగడమే కాదు.. మంచి వైద్యంకూడా అందుబాటులోకి వస్తుందన్న సీఎం

ఒక ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశం

ఒకవైపు నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ఆస్పత్రులను ఆధునీకరించడం, ఇప్పటికే ఉన్న 11 బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు, ఈ కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాలనూ ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం


*మెడికల్‌ హబ్స్‌ ఏర్పాటు ప్రగతిపైనా సీఎం సమీక్ష*

వీలైనంత త్వరగా ప్రక్రియను వేగవంతం చేయాలన్న సీఎం 


ప్రయివేటు రంగంలోకూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు రావాలన్నదే ఈహబ్స్‌ ఉద్దేశమన్న సీఎం


*బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌*

వైద్య ఆరోగ్యశాఖలో జనరల్‌ బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌

ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలి

ఆలోగా కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తిచేయాలి: అధికారులకు సీఎం ఆదేశం


ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్‌(నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఏ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.