గుంటూరు (ప్రజా అమరావతి);
*గుంటూరు జిల్లాలో మిర్చి సాగు - ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు, శ్రీమతి మేకతోటి సుచరిత పాయింట్స్...*
*- రాష్ట్రం రసం పీల్చే పురుగు చంద్రబాబుః మంత్రి కన్నబాబు*
*- 2019 నుంచే బాబుకు పోగాలం దాపురించిందిః మంత్రి కన్నబాబు*
*- భూముల కోసం రాజధానా.. రాజధాని కోసం భూములా.. దీని మీద రాష్ట్రంలో చర్చ జరగాలి.*
*- తనవాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ బాగుంటుందో అక్కడ రాజధాని పెట్టిన ఘనుడు బాబు*
*- భూముల విలువ పెరగడమే చంద్రబాబు లెక్కలో అభివృద్ధా..?*
*వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఏమన్నారంటే..*
- గుంటూరు జిల్లాలో మిర్చి పంటను నల్లి తెగులు ఆశించి మొత్తం రసం పీల్చడంతో రైతులు తమ పంట నష్ట పోతున్నారు.
- రాష్ట్రంలో ఇంకో రసం పీల్చే పురుగు ఉంది.. దానిపేరు చంద్రబాబు నాయుడు.
- ఆ పురుగు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం.. ఈ రాష్ట్రం మొత్తం రసం పీల్చేసింది.
- ఆ పురుగును భరించడం కష్టం అని.. 2019లో మళ్ళీ తిరిగి లేవని స్థాయిలో ప్రజలు పురుగుమందు కొట్టారు.
- దాంతో తల్లడిల్లిపోయి, దిక్కుతోచని స్థితిలో, మైండ్ బ్లాక్ అయి ఇప్పుడు తండ్రీకొడుకులు రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు.
- 2019లోనే మీకు పోగాలం దాపురించింది. పోగాలం ఎవరికి దాపురించిందో చూస్తున్నాం కదా.. మీకు సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా..
- 2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా సేమ్ టు సేమ్ రిజల్ట్స్ ప్రజలు ఇస్తున్నారు. ఏకపక్షంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వానికి పట్టం కడుతున్నారు. ప్రజలు మీకు ఇంతగా గుణపాఠం చెబుతున్నా.. చంద్రబాబు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు.
- ఈ రాష్ట్రం రసం పీల్చేసి, అధికారంలో ఉన్న ఐదేళ్ళూ పీక్కుతుని, రాష్ట్ర ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలుగా మార్చి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబు
- రాష్ట్రం విడిపోయిన తర్వాత సీనియర్ నాయకుడు అని అవకాశం ఇస్తే.. రాజధాని ఎక్కడ పెట్టాలంటే.. మన వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ బాగుంటుందో చూసి అక్కడ బెట్టారు.
- ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో, పదేళ్ళ రాజధాని హక్కును వదులుకుని, ఓటుకు కోట్ల కేసులో కేసిఆర్ చేతికి దొరికిపోయి.. మూటముల్లె సర్దుకుని రాత్రికి రాత్రి చంద్రబాబు ఇక్కడకు వలస వచ్చినట్టుగా పారిపోయి వచ్చాడు.
- సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకునే విధంగా, అమరావతి ప్రాంతంలో భూములను తక్కువ రేటుకు కొట్టేసి, తన సొంత మనుషులతో భూములను కొనిపించి అమరావతి రాజధాని అని కథలు చెప్పాడు.
- అమరావతి రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారా.. లేదు. ఆ ప్రాంతంలో రైతుల అరటి తోటలు నరికేసి, రైతుల మీద కేసులు పెట్టి, మీ బినామీల చేత, మీకు సంబంధించిన కొంతమంది పెద్దల చేత ఆ భూములు కొనిపించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, రాజధాని పేరుతో గ్రాఫిక్స్ జిమ్మిక్కులతో ప్రజలను ముంచితే.. 5 ఏళ్ళ తర్వాత మీ పార్టీ, మీ బతుకు ఎలా బిక్క చచ్చిపోయిందో చూశాం.
-హైదరాబాద్ లో రూ. 20 వేల భూమి రూ. 60 కోట్లు అయిందని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. భూముల విలువలు పెరగడమే చంద్రబాబు చేసిన అభివృద్ధా..?
- తింటానికి తిండి లేదు... వైద్యం లేదు.. చదువుకోవడానికి దిక్కు లేదు.. అని రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఆవేదనతో, క్షోభతో ఉంటే, ఆ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డిగారు సంక్షేమ పథకాల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు ప్రయత్నించడం అభివృద్ధి కాదా.. ? చంద్రబాబు లెక్కలో భూముల రేట్లు పెరగడమే అభివృద్ధా..?
- అమరావతి రాజధాని చేస్తే.. ఇదే గుంటూరు జిల్లాలో కొండేపాడు ప్రాంతంలో భూముల రేట్లు ఎందుకు పెరగలేదు.. మీరు కొనలేదు కాబట్టి ఇక్కడ పెరగలేదా...?. ఎంతసేపటికీ భూముల రేట్లు పెరగడమే మీకు కావాల్సింది. తద్వారా మీ వాళ్ళని కుబేరులుగా మార్చడం. ఆ డబ్బులతో మళ్ళీ ఎన్నికల్లో రాజకీయం చేయడమే మీ లెక్క. చంద్రబాబు లెక్క తప్పింది కాబట్టే, పగ, ప్రతీకారం, ఈర్ష్య, కోపం జగన్ గారిపై చూపిస్తున్నాడు.
- భగవంతుడు, ప్రజలు జగన్ గారి వైపు ఉన్నారు.
- పులి బొమ్మ వేయబోతే.. పిల్లి బొమ్మ వేశారని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. పులి కడుపున పులే పుడుతుంది అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డిగారు పులి బిడ్డ. పిల్లులు ఎవరు, హైదరాబాద్ వదిలి రాత్రికి రాత్రి బితుకు బితుకుమని ఇక్కడకు వచ్చి బతికిన వారు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ అరాచకానికి రాష్ట్రం బలైపోయింది నిజం కాదా..?
- చంద్రు అని చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన రిటైర్జ్ జడ్జి వచ్చి ఇక్కడ మాట్లాడితే.. ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందో కళ్ళకు కట్టినట్టు చెబితే.. మీకు బాధగా ఉంది. ఆయన మీద విరుచుకపడటమా.. ?
- మేం అధికారంలో ఉన్నాం గనుక కొంతమంది గురించి మేం మాట్లాడలేం. మీరు ఏదన్నా మాట్లాడవచ్చు, ఎవరి గురించి అన్నా మాట్లాడవచ్చు.
- చంద్రబాబుకు తోడు ఆయన తప్పెటగూళ్ళ బ్యాచ్ అచ్చెన్నాయుడు అండ్ కో శాపనార్థాలు పెడుతున్నారు. పులివెందులలో గెలవరని మాట్లాడుతున్నారు. ముందు మీ కుప్పం పరిస్థితి చూసుకోండి. 30 ఏళ్ళ నుంచి మీ చేతుల్లో కుప్పం నియోజకవర్గం ఉంటే, మీ కబంధ హస్తాల్లో జనం విలవిల్లాడిపోయి.. మీ వల్ల జనం నాశనం అయిపోతున్నారని జనం బయటకు వచ్చి, మొన్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిగారికి ఏకపక్షంగా పట్టం కట్టారు. అది మరిచిపోకండి.
- 2019 ఎన్నికల్లో లెక్క తప్పి కొంతమంది బయటపడ్డారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో వారి పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు మానుకోండి.
- న్యాయస్థానం టు దేవస్థానం.. ఎవరి కోసం, ఎవరు స్పాన్సర్డ్ చేస్తే యాత్రలు చేశారో రాష్ట్రంలోని అందరికీ తెలుసు. పబ్లిక్ గానే బంగారు గాజులు ఇచ్చారు. అమెరికాలో జోలి పట్టి డబ్బులు వసూలు చేశారు.
- చంద్రబాబు పోగాలం దాపురించింది మాకు కాదు.. మీకే 2019లోనే దాపురించింది. దాని నుంచి బయట పడటం అసాధ్యం. మీ పార్టీని బతికించుకోవడం కోసం.. ఎంతకాలం జగన్ మోహన్ రెడ్డిగారిని చూసి ఏడుస్తారు.
- భూముల కోసం రాజధానా.. రాజధాని కోసం భూములా.. దీని మీద రాష్ట్రంలో చర్చ జరగాలి.
- ఎంతసేపటికీ మీకు రియల్ ఎస్టేటే తప్ప.. స్టేట్ ప్రయోజనాలు పట్టవు. అన్ని వ్యవస్థలనూ వాడతారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ లూప్ పోల్స్ వెతుకుతారు. అమరావతిలో మీ భూముల రేట్లు పెరిగితే చాలా.. ?
- మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడండి. ప్రజల్లో చులకనైపోవద్దు. జగన్ మోహన్ రెడ్డిగారి మీద ఏడవటం వల్ల ప్రయోజనం ఉండదు. ఎంతకాలం జగన్ గారిపై ఈర్ష్యా, ద్వేషాలతో రగిలిపోతారు.
*హోం మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ఏమన్నారంటే..*
*- అధికారానికి దూరమైతే క్షణం కూడా అగలేనన్నట్టుగా బాబు పిచ్చి ప్రేలాపనలు*
*- కుప్పంలో కూడా ఎందుకు ఓడిపోయానా.. అని బాబు ఆత్మ విమర్శ చేసుకోవాలి.*
- గౌరవ సీఎం శ్రీ జగన్ గారు రెండున్నరేళ్ల కాలంలోనే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ, ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చూసి ప్రజలందరూ ఏ ఎన్నికలు వచ్చినా.. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో.. ఇలా అన్ని ఎన్నికల్లోనూ వైయస్ఆర్ సీపీకి అండగా ఉంటూ, జగన్ గారి పాలనకు మద్దతుగా నిలబడుతున్నారు.
- కానీ, సీఎం గారిని టీడీపీ నేతలు అనరాని మాటలు అంటూ దూషిస్తూ.. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..
- చంద్రబాబు, తన ఐదేళ్ల పరిపాలనలో ప్రజారంజకంగా పాలన చేస్తే.. టీడీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. స్వయంగా తన నియోజకవర్గంలోనే ఎందుకు ఓడిపోయానా? అని చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
- చంద్రబాబు 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఉన్న పరిస్థితిలో ప్రజల చేత తిరస్కరించబడ్డారు, ఈరోజు అధికారానికి దూరమైతే క్షణం కూడా ఉండలేనని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు ప్రేలాపనలు చేస్తున్నారు..
- చంద్రబాబుని ఆయన కుటుంబసభ్యులు ఒక్కసారి హస్పటల్ లో చూపించాలి. ఎందుకంటే, అధికారానికి దూరం అయినప్పుడల్లా "నేను మారిపోయనని" ప్రజల దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడతారు..
- చంద్రబాబు ఏనాడైనా, ప్రజలు ఎందుకు తిరస్కరించారని పోస్ట్ మార్టం చేసుకున్నారా? అలా చేసుకోకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న జగన్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మొన్న కూడా జగన్ గారు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించినప్పుడు గాలిలో వస్తాడు.. గాలిలో పోతాడని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు..
- చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి.. తిట్ల పురాణం చేయడం ఏంటి..?
- ప్రజా రాజధాని అంటే అన్ని రకాల ప్రజలకు అక్కడ నివాసయోగ్యంగా ఉండాలి. కానీ, సామాన్యుడు వెళ్ళి నివసించడానికి కానీ, ఇల్లు కట్టుకునే పరిస్థితి కానీ అమరావతిలో ఉందా? అంటే లేని పరిస్థితి
- అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వబోతుంటే డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ వస్తుందని, పేదలు ఉండడానికి వీల్లేదని అడ్డుకునే పరిస్థితి.
- జస్టిస్ చంద్రు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీద, న్యాయవ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో.. ప్రజలు మద్దతిచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద కోర్టులు ఏ విధంగా జోక్యం చేసుకుంటున్నాయి.. ఇది కరెక్టా? అని మాట్లాడితే.. రిటైర్డ్ జడ్జితో మేమేదో మాట్లాడిస్తున్నామని విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టు..?
- వరుసగా ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు ఎందుకు ఓడిపోతున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి..
addComments
Post a Comment