పులివెందుల, వైఎస్సార్ కడప జిల్లా (ప్రజా అమరావతి);
*వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ళ పట్టాల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్, అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రులు, లబ్దిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*
*శ్రీ ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం (రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి)*
ఈ రోజు సీఎంగారి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో అడుగులు వేస్తుంది
. ఈ రాష్ట్రంలో సుమారు 32 లక్షల ఇళ్ళ పట్టాలను పేదలకు ఇస్తున్న సందర్భం, కడపలో టీడీపీ వారు అడ్డుకున్నా, న్యాయపరమైన చిక్కులు తొలగించుకుని మీ అందరికీ ఇస్తున శుభ సందర్భం ఇది. పేదవాడికి ఇల్లంటే ఒక సామాజిక గౌరవం, ఒక సామాజిక భద్రత. నాడు ప్రజాసంకల్ప యాత్రలో మన నాయకుడు ఆ రోజే తీసుకున్న నిర్ణయం. ఎంతమంది ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టించడమే లక్ష్యం. సీఎంగారు ఏ కార్యక్రమం చేసినా మానవత్వం ఉట్టిపడుతుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అండగా ఉండాలని, అందరినీ ఆదుకోవాలనే లక్ష్యంతో ఉన్న సీఎంగారికి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలి, కలకాలం ఆయనే సీఎంగా ప్రజలకు మరిన్ని సేవలు చేసే దిశగా మీరంతా ఆశీర్వదించాలని ప్రజలను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
*శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి*
పులివెందులలో ఏలాగైతే అభివృద్ది జరుగుతుందో రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గాలలో కూడా అలాగే అభివృద్ది జరుగుతుంది. నాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో 24 లక్షల మందికి ఇళ్ళ స్ధలాలు ఇస్తే ఇప్పుడు మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్ గారు 32 లక్షల మందికి ఇళ్ళ స్ధలాలు ఇవ్వడమే కాక, ఇళ్ళు కట్టిస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే బడుగు,బలహీనవర్గాలకు రూ. 4 లక్షల కోట్లు ఇచ్చినట్లవుతుంది. ఇవికాక సీఎంగారి పుట్టినరోజున ఓటీఎస్ ద్వారా 52 లక్షల మందికి సంపూర్ణ గృహహక్కు పధకాన్ని తీసుకొచ్చారు, దీని విలువ రూ. 4 లక్షల కోట్లు. సుమారు రూ.8 లక్షల కోట్లు నిరుపేదలకు ఆస్తిని ఇస్తున్నారు. ప్రజల కష్టం తెలుసుకున్న నాయకుడే పరిపాలన చేయగలరు. రాష్ట్రంలో 17వేలకు పైగా లేఔట్లు వేసి పట్టణాలను, నగరాలను తయారుచేస్తున్నారు. మనం ఇళ్ళ నిర్మాణంలో దేశంలోనే మొదటి స్ధానంలో ఉన్నాం. పులివెందుల లే అవుట్‌ను మోడల్ లే అవుట్‌గా తీర్చిదిద్దుతాం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
*రేణుక, లబ్దిదారు, పులివెందుల*
అన్నా నా భర్త ఆటోడ్రైవర్, నాకు ఇద్దరు పిల్లలు. నాకు సొంతిల్లు లేదు, నేను 9 ఏళ్ళుగా అద్దె ఇంటిలో ఉన్నాను, గత ప్రభుత్వంలో ఇంటి కోసం ఎన్నో సార్లు తిరిగాను కానీ నాకు రాలేదు, ఇక రాదనుకున్నా. కానీ మీరు సీఎంగా వచ్చారు, మీకు ప్రజల కష్టాలు తెలుసు. మీరు పాదయాత్రలో చెప్పినట్లు నాకు ఇంటి స్ధలం వచ్చింది. మీ చేతుల మీదుగా నేను ఇంటి పట్టా అందుకుంటుంటే నాకు ఈ రోజే సంక్రాంతి పండుగ చేసుకున్నంత ఆనందంగా ఉంది. నా పిల్లలకు మేనమామవై అమ్మ ఒడి ఇచ్చారు, నాకు వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, కరోనా కష్టకాలంలో కూడా మమ్మల్ని ఆదుకున్నారు, నెలకు రెండు సార్లు రేషన్ ఇచ్చారు, ఇస్తున్నారు. ఆడవారికి రక్షణ కోసం అన్నా మీరు ఒక అన్నయ్యలా, తమ్ముడిలా, ఒక తండ్రిలా ఆలోచించి దిశ చట్టం తీసుకొచ్చారు. ఇవన్నీ చేయాలంటే ఒక వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే సాధ్యం. అందుకే అంటారు పెద్దలు...పులి కడుపున పులే పుడుతుందని. ఇన్ని ఇచ్చిన నా దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను, నా శిరస్సు వంచి పాదాభివందనం తెలపడం తప్ప. అందుకే అంటున్నాను రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
addComments
Post a Comment