వరద ప్రాంతాలకు కాకాణి

 *"వరద ప్రాంతాలకు కాకాణి


"**శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కాకర్లవారిపాళెం, పూడిపర్తి, తిరుమలమ్మపాళెం గ్రామాలలో పర్యటించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*


*వరదల కారణంగా రాకపోకలు ఆగిపోయిన తిరుమలమ్మపాళెం గ్రామానికి బోటులో వెళ్లి, ప్రజల స్థితిగతులను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి.*
 భారీ వర్షాలకు వరదలకు నష్టపోయిన ప్రజలకు మనోధైర్యం కల్పించి, అండగా నిలుస్తున్నాం.


 నష్టపోయిన రైతాంగానికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం.


 వ్యవసాయం చేసుకోవడానికి రైతులకు అడ్డుగా ఉన్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం.


 గ్రామాలలోని కాలనీలలో శిథిలావస్థకు చేరుకున్న పురాతన ఇళ్ళను తొలగించి, నూతనంగా ఇల్లు మంజూరు చేయిస్తాం.


 తిరుమలమ్మపాళెం గ్రామ ప్రజలకు వీలైనంత త్వరలో బ్రిడ్జి మంజూరు చేయించి, నిర్మిస్తాం.


 ప్రజల అవసరాలను గుర్తించి భవిష్యత్తులో మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తాం