= లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన విజేతలకు మారుతీ ఆల్టో ఎల్ఎక్స్ఐ కార్లు
= జీవీమాల్లో లక్కీ డ్రా తీసిన మంత్రి కొడాలి నాని
= విజేతగా నిలిచిన నాగవరప్పాడుకు చెందిన ఇంద్రజ
గుడివాడ, డిసెంబర్ 17 (ప్రజా అమరావతి): గుడివాడ పట్టణంలోని జీవీమాల్ లో లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన విజేతలకు మారుతీ ఆల్టో ఎల్ఎక్స్ఐ కార్లను బహుమతిగా అందజేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం రాత్రి గుడివాడ పట్టణం రాజబాపయ్య చౌక్ సెంటర్లోని జీవీమాల్ షోరూం ఎదుట మంత్రి కొడాలి నాని మొదటి లక్కీ డ్రా తీశారు. ఈ డ్రాలో మొదటి కారు విజేతగా గుడివాడ పట్టణం నాగవరప్పాడుకు చెందిన ఇంద్రజ నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని స్వయంగా లక్కీ డ్రాలో కారును గెల్చుకున్న ఇంద్రజకు ఫోన్ చేసి గుడివాడ పట్టణ ప్రజలు, జీవీమాల్ తరపున అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని జీవీమాల్ సంస్థ లక్కీ డ్రా కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. జీవీమాల్ లో దుస్తులను కొనుగోలు చేసిన ఖాతాదారులకు రూ.500 లకు ఒక కూపన్ చొప్పున ఇస్తున్నారన్నారు. ఈ నెల 1 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు కొనుగోలు చేసిన 25 వేల మంది ఖాతాదారులు కూపన్లలో ఒక కూపన్ ను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశామన్నారు. ఎంపికైన ఖాతాదారుకు మారుతీ ఆల్టో కారును అందజేయడం జరుగుతుందన్నారు. మొదటి లక్కీడ్రా తన చేతులమీదుగా తీయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ నెల 16 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే కొనుగోళ్ళకు సంబంధించిన కూపన్లలో మరో కూపన్ను లక్కీ డ్రా ద్వారా తీసి ఇంకో మారుతీ ఆల్టో కారును బహుమతిగా అందజేస్తారన్నారు. జనవరి 1 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు ఇచ్చిన కూపన్లలో ఒక కూపన్ ను లక్కీ డ్రా ద్వారా తీసి మరో మారుతీ ఆల్టో కారును బహుమతిగా అందజేస్తారన్నారు. గతంలో గుడివాడ ప్రాంత ప్రజలు నాణ్యమైన వస్త్ర శ్రేణి కోసం విజయవాడ, ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారన్నారు. జీవీమాల్ షోరూంను ఏర్పాటు చేసిన తర్వాత కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన దుస్తులు అందుబాటులోకి వచ్చాయన్నారు. జీవీమాల్ వంటి షోరూంలను ప్రజలు ఆదరించాలని, తద్వారా మరిన్ని మాల్స్ గుడివాడ ప్రాంతానికి వస్తాయన్నారు. జీవీమాల్ అధినేతలు మాట్లాడుతూ తమ వద్ద నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకే అందిస్తూ వినియోగదారుల మన్ననలను పొందుతున్నామన్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన అన్నిరకాల వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. గుడివాడ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు, జీవీమాల్ ఖాతాదారులు క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా నిర్వహిస్తున్న లక్కీ డ్రా కార్యక్రమాల్లో పాల్గొని మారుతీ ఆల్టో ఎలెక్సస్ఐ కార్లను గెల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం, పార్టీ నేతలు పాలడుగు రాంప్రసాద్, పాలేటి చంటి, షేక్ బాజీ, మురారి నగేష్, గోవాడ చంటి తదితరులు పాల్గొన్నారు.