అమరావతి యాత్ర రాజకీయ యాత్ర"

 *" అమరావతి యాత్ర రాజకీయ యాత్ర"*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
 అమరావతి యాత్ర ఒక ప్రాంత అభివృద్ధి కోసం ప్రాంతీయ నినాదంతో  కొంతమంది చేస్తున్న పాదయాత్ర.

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం.


న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు చేస్తున్న అమరావతి పాదయాత్రలో రాజకీయ ప్రస్థానం ఎందుకో...!


అమరవతి యాత్ర ద్వారా ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య తెలుగుదేశం పార్టీ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంది.


అమరావతి పాదయాత్రకు హై కోర్టు తీర్పు ఆంక్షలతో కూడిన అనుమతి ఉందనేది అందరికి తెలుసు...


న్యాయస్థానం ఆదేశాలకు విఘాతం కలగకూడదనే విధంగా అధికారులు నిబంధనల ప్రకారం చేసుకోవాలంటే... దానిపై రగడ సృష్టిస్తున్నారు.


 అమరావతి  పాదయాత్రలోని వారు న్యాయస్థాన ఆదేశాలకు గౌరవం ఇవ్వకుండా బేఖాతరు చేస్తారా..!


న్యాయస్థానం సూచనలను బేఖాతరు చేస్తూ, చేపట్టే పాదయాత్రను పోలీస్ యంత్రాంగం ఆపితే, ఎమ్మెల్యేకు అంటగట్టడం ధర్మమా!


అమరావతి పాదయాత్రను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ నియోజవర్గాల వారీగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను వారిచే తిట్టించడం పరిపాటిగా మారింది...


రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోరుకునే ప్రజలు అమరావతి పాదయాత్రకు సంఘీభావం తెలపటం లేదు.


చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు భూముల రేట్ల కోసం చేయిస్తున్న పాదయాత్ర నిజస్వరూపం ప్రజలకు తెలుసు.


 తెలుగుదేశం నాయకులు కొని తెచ్చి చల్లే పూలతో, అమరావతి రైతులపై  పూలవర్షం అనుకుందామా!.


అమరావతి రైతు యాత్ర పై స్థానికులు ఎప్పుడైనా, ఎవరైనా స్వచ్ఛందంగా పూల వర్షం కురిపించిన సంఘటనలు ఉన్నాయా!


అమరావతి రైతులు అనవసరంగా అవుట్ డేటెడ్ పోలిటిషియన్ సోమిరెడ్డి ట్రాప్ లో పడి ఇబ్బందులు పడ్డారు..


 అమరావతి పాదయాత్ర సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రవేశించగానే శనీశ్వరుడు సోమిరెడ్డి రూపంలో యాత్ర చేస్తున్న వారితో జతకట్టడంతో వాళ్లకు కష్టాలు మొదలయ్యాయి.


వరుస ఓటముల లీడర్ చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గంలో మనుషులు లేక ఆత్మకూరు, నెల్లూరు జిల్లా మొత్తం నుండి పొదలకూరులో పాదయాత్రకు జనాలను తెచ్చుకునే దౌర్భాగ్యం పట్టింది..


అమరావతి రైతుల పాదయాత్ర వస్తుందని తెలిసి పోదలకూరు మండలంలో 10 అంకణల స్దలం,నాలుగైదు ఇళ్లు కూడా రైతుల భోజన వసతికి, విడిదికి ఏర్పాటు చేయలేని దద్దమ్మ లీడర్ సోమిరెడ్డి..


మాజీ మంత్రిగా గొప్పలు చెప్పుకునే సోమిరెడ్డి మోహం చూసి కనీసం పాదయాత్రకు ఎవ్వరు వసతి కూడా ఇవ్వలేదంటే అది సోమిరెడ్డి రేంజ్ ను తెలుపుతుంది..


 జననేత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే, వైసిపి కార్యకర్తలు అడ్డుపడితే అసలు పాదయాత్ర ఒక్క అడుగైన ముందుకు పడుతుందా… మాకు సభ్యత, సంస్కారం ఉంది కనుకే అమరావతి రైతులు టిడిపి లీడర్స్ ట్రాప్ లో పడి మమ్మల్ని విమర్శిస్తున్నా, రెచ్చగొట్టినా సహనంతో ఉన్నాం..


వరదల్లో, భారీ వర్షల్లో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులను గాలికొదిలేసి రియల్ ఎస్టేట్ పాదయాత్రలకు టిడిపి లీడర్స్ లక్షలు ఖర్చు పెట్టడం సిగ్గు చేటు..


 అమరావతి పాదయాత్రకు కూలీకి పక్క ప్రాంతాల నుండి జనాలను తెప్పించినా అత్యంత పేలవంగా సాగింది.


 మా అభిమానులు మా పార్టీ ఫ్లెక్సీలు కట్టడాన్ని కూడా సోమిరెడ్డి తప్పుపడుతున్నాడు.


మహిళలు చేస్తున్న అమరావతి పాదయాత్రకు సహకరించకపోయినా, కించపరిచే మనస్తత్వం మాది కాదు.


రైతుల పేరుతో, మహిళల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వైసిపి వ్యతిరేక పార్టీలు చేయిస్తున్న అమరావతి పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం..అంతే గాని భోజనాలు, టెంట్లు, వసతి లేకుండా చేయడం లాంటి చీప్ పనులు చేయం..సోమిరెడ్డి తన చేతగానితనాన్ని, వైసిపి పై నెట్టే కుట్ర చేసి, నవ్వుల పాలయ్యాడు..