దెబ్బ తిన్న రోడ్డు పరిస్థితిని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి కి వివరించారు.

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి, తొలుత నెల్లూరు రూరల్ మండల పరిధి లోని నెల్లూరు - ములుముడి, తాటిపర్తి రోడ్డు దేవరపాలెం వద్ద దెబ్బ తిన్న ఆర్ అండ్ బి రోడ్డు ను  పరిశీలించారు.  

ఈ సందర్భంగా దెబ్బ తిన్న రోడ్డు పరిస్థితిని  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి కి వివరించారు.


18 లక్షల 50 వేల రూపాయలతో ఈ రోడ్డును తాత్కాలికంగా పునరుద్ధరించడం జరిగిందని,  శాశ్వత మరమ్మతులు కోసం 50 లక్షల రూపాయలు అవసరం కాగలదని,  ప్రతిపాదనలు పంపినట్లు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి కి,  జిల్లా కలెక్టర్ వివరించారు.  ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరిగిన నష్టాల గురించి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  ముఖ్యమంత్రి కి వివరించారు. జరిగిన నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి తిలకించారు.


అనంతరం  జొన్నవాడ వద్ద దెబ్బ తిన్న పెన్నా నది పొర్లుకట్టను, పంటలను  ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి పరిశీలించారు. వరద పరిస్థితి ని, జరిగిన పంట నష్టాల గురించి కోవూరు శాసన సభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కి వివరించారు. బైనాక్యులర్ ద్వారా ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి, జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా  పంట నష్టాలపై ఏర్పాటు చేసిన  ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి తిలకించారు.


ముఖ్యమంత్రి కాన్వాయ్ వెంట మంత్రులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి, డా. అనిల్ కుమార్, శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి,  శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు,  వివిధ  శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.