శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):

      మూలా నక్షత్రం సందర్భంగా రుద్ర హోమం జరుగు యాగశాల యందు  సరస్వతీ యాగం ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది..

     ఈ కార్యక్రమం నందు ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమి నాయుడు  మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గార్లు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

అనంతరం నిర్వహించిన మహా పూర్ణాహుతి కార్యక్రమముతో సరస్వతీ యాగం మరియు కార్తీక మాస ఉత్సవములు దిగ్విజయంగా ముగిసినవని ఆలయ స్థానాచార్యులు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు..

 అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పెన్నులు, అమ్మవారి కంకణము, ఫోటో ప్రసాదంగా చైర్మన్ గారు మరియు కార్యనిర్వహణాధికారి గారు పంపిణీ చేయడం జరిగినది.