దేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణవార్త కలచివేసింది : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 *దేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణవార్త  కలచివేసింది : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


*ఆర్మీ,నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి కీలక రక్షణ విభాగాలను ఒకే తాటిపై నడిపించిన మార్గనిర్దేశకుడిని కోల్పోవడం దేశానికి తీరని లోటు*


అమరావతి, డిసెంబర్, 08 (ప్రజా అమరావతి)


; దేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణవార్త కలచివేసిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ గా ఆర్మీ,నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి కీలక రక్షణ విభాగాలను ఒకే తాటి పైన నడిపించిన  మార్గదర్శి బిపిన్‌ రావత్‌ ని కోల్పోవడం దేశానికి తీరని లోటని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. శిక్షణ, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్‌, రిపేర్, మెయింటెనెన్స్ వంటి పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంలో ఆయన కృషి దేశం మరవదన్నారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన  సతీమణి మధులిక రావత్ సహా 11 మంది అధికారులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు మంత్రి గౌతమ్ రెడ్డి సానుభూతి ప్రకటించారు.