పెనుగొండ (తూర్పు పాలెం (ప్రజా అమరావతి) ;
రాష్ట్రంలో ని ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబానికి సొంత ఇంటి కల సాకారం చెయ్యడం జరుగుతొందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు.నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటున్న అతి పెద్ద అధికారిక కార్యక్రమన్నారు.
స్థానిక తూర్పుపాలెం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, తణుకు పట్టణంలో, తొలిసారిగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో ప్రతిష్టాత్మకమైన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఏర్పాటు
చేస్తున్నామన్నారు. అదేరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం కావడంతో హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణం వరకు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల మంది లబ్దిదారులకు సంపూర్ణ గృహ హక్కు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. మొత్తం 70 వేల మంది తో భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు.
52 లక్షల మంది కుటుంబాలకు సంపూర్ణ గృహ హక్కు కలిపించే దిశలో రూ.10,500 వేల కోట్లుమేర రుణ మాఫీ చెస్తున్నామన్నారు. రూ.14 వేల కోట్ల రుణాలు హడ్కోనుంచి తీసుకుని లబ్దిదారులకు చెందిన రూ.10,500 మేర ప్రభుత్వమే హడ్కో కి చెల్లిస్తుందని, 52 లక్ష లమంది లబ్దిదారులు సుమారు 3 వేల కోట్లు లబ్దిదారుడు చెల్లిస్తే సరిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆ ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే, కాకుండా ఇంటి వద్దే పత్రాలు అందచేయ్యడం ఈ ఓటీఎస్ పధకం ఉద్దేశ్యం అన్నారు. పేద ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు హర్షించే స్థితిలో లేరన్నారు. గత ప్రభుత్వం సమయంలో గృహ నిర్మాణ సంస్థ ఇళ్ల నిర్మాణం అప్పుపై వడ్డీ మాఫీ కోసం నాలుగు సార్లు పంపితే అప్పటి ముఖ్యమంత్రి , ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు పైల్ త్రిప్పి పంపారు. అదే సమయంలో రాష్ట్రంలో గృహాలుపై ఉన్న అప్పు పూర్తిగా చెల్లించి న 43,667 మంది లబ్దిదారులకు సంపూర్ణ హక్కు కల్పించాలని కోరినా తిరస్కరించారన్నారు. ఇప్పుడు జగనన్న అటువంటి లబ్దిదారులకి కేవలం రూ 10 లతో రిజిస్ట్రేషన్ చేసే శాశ్వత హక్కు పత్రాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఒక ప్రక్క సంక్షేమం, మరో ప్రక్క అభివృద్ధి కి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. నాడు నేడు వంటి కార్యక్రమాలు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లో భాగంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోఒక మెడికల్ కాలేజీ, తణుకు లో జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. రైతులకు కూడా అండగా ఉంటూ దెబ్బతిన్న పంటలకు పరిహారం అందిస్తున్న మని తెలిపారు.
.
అంతకుముందు తణుకు జెడ్పి హై స్కూల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను, ఎస్ కె ఎస్ మహిళా కళాశాల ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాట్లను శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, శ్రీనివాస నాయుడు తదితరులు తో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమం లో శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.