శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి): 

    ఈరోజు అనగా ది.29-12-2021 న ఉదయం 11 గం.లకు దేవస్థానం నందలి యాగశాల యందు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ , వైదిక కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చక సిబ్బందిచే  చండీ యాగశాల యందు భవానీ దీక్షా మహోత్సవముల యొక్క పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించడమైనది. 

     ఈ కార్యక్రమం నందు ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు దంపతులు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ  మరియు పాలకమండలి సభ్యులు శ్రీమతి ch. నాగవెంకట వరలక్ష్మి , శ్రీమతి నేలపట్ల అంబికా , శ్రీమతి ఎన్. సుజాత  పాల్గొని, భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు.  ఈ పూర్ణాహుతి కార్యక్రమం తో భవానీ దీక్షా కార్యక్రమంలు  దిగ్విజయంగా పూర్తి అయ్యాయని ఆలయ స్థానాచార్యుల వారు తెలిపియున్నారు.