హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుండి 68 చెరువులకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి*హెచ్ ఎన్ ఎస్ ఎస్ ప్రధాన కాలువ నుండి 68 చెరువులకు నీటిని మళ్లించే పనులను త్వరితగతిన పూర్తి చేసి ఈ నెలాఖరులోగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం :-*


*HNSS ప్రధాన కాలువ నుండి 68 చెరువులకు  నీటిని మళ్లించే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ :-*


కృష్ణగిరి/కర్నూలు, జనవరి 04 (ప్రజా అమరావతి);


*హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుండి 68 చెరువులకు  నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి


చేసి ఈ నెలాఖరులోగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ పేర్కొన్నారు*. 


*మంగళవారం కృష్ణగిరి మండలం లక్కసాగరం పంప్ హౌస్ వద్ద HNSS ప్రధాన కాలువ నుండి 68 చెరువులకు నీటిని మళ్లించే పనులను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. మంత్రి గారి వెంట జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తదితరులు ఉన్నారు.*


*రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  మాట్లాడుతూ.....కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన పత్తికొండ నియోజకవర్గంలో 35 చెరువులు, డోన్ నియోజక వర్గంలో 28 చెరువులు, ఆలూరు నియోజకవర్గంలో 3 చెరువులు, పాణ్యం నియోజక వర్గంలో 2 చెరువులకు HNSS ప్రధాన కాలువ నుండి లిఫ్ట్ చేసి నింపేందుకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులను ఆదేశించామన్నారు.*


*గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులకు 13 ఎకరాల భూ సేకరణ జరిగితే, ప్రస్తుత ప్రభుత్వం 117 ఎకరాల భూ సేకరణ జరిగిందని తెలిపారు. అప్పటి ప్రభుత్వం 35 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఇప్పటి ప్రభుత్వం ఇప్పటివరకు 117 కోట్ల విలువ గల పైప్లైన్ నీటి సరఫరా పనులు చేపట్టి పూర్తి చేస్తున్నామన్నారు. లక్కసాగరం పంప్ హౌస్ లో అప్పుడు ఒక పంపింగ్ మిషన్ వినియోగంలో ఉండేదని ఇప్పుడు మూడు పంపింగ్ యంత్రాలు రన్ అవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం 34 కిలోమీటర్ల పైపులైన్లు వేయగలిగితే, ప్రస్తుత ప్రభుత్వం 128 కిలోమీటర్ల మేర పైప్లైన్ పూర్తీ చేశామన్నారు. గతంలో రెండు కిలోమీటర్ల జాయింట్, లైనింగ్  పనులు పూర్తయితే, ప్రస్తుతం 58 కిలోమీటర్ల జాయింట్, లైనింగ్  పనులు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. 2019 నుండి ఈ ప్రాజెక్టు పనులు  శరవేగంగా జరుగుతున్నాయన్నారు.*


*సాగు, తాగునీటి కోసం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో హెచ్ యన్ ఎస్ ఎస్, జి ఎన్ ఎస్ ఎస్ ప్రాజెక్టులకు సంబంధించి రాయలసీమ ఉద్యమంలో ప్రాధాన్యత తీసుకువచ్చారన్నారు. ఆ సమయంలో ఉన్న ప్రభుత్వం హంద్రీ నీవా సుజల స్రవంతికి,  జి ఎన్ ఎస్ ఎస్ కాలువలకు13కోట్లు కేటాయిస్తే, వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 1800 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్ డి ఎం ఎస్, హెచ్ ఎన్ ఎస్ ఎస్, జి ఎన్ ఎస్ ఎస్ తదితర ప్రాజెక్టులను మెరుగైన రీతిలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువలో నీళ్ళు పారుతున్నాయంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి చొరవే అని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలోనే హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలవ పనుల పురోగతి మెరుగ్గా ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హరిప్రసాద్, జలవనరుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు*