ఒంగోలు జాతి పశుసంపదను వృద్ధి చేసేందుకు పశు పోషకులందరూ కృషి చేయాలి




- ఒంగోలు జాతి పశుసంపదను వృద్ధి చేసేందుకు పశు పోషకులందరూ కృషి చేయాలి 


- మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని 

- సబ్ జూనియర్స్ లో వేటపాలెం ఎడ్ల జతకు ప్రథమస్థానం 



గుడివాడ, జనవరి 17: ఒంగోలు జాతి పశుసంపదను వృద్ధి చేసేందుకు పశుపోషకులందరూ కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్ లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల్లో భాగంగా సీనియర్స్ విభాగంలో పోటీలను ఆయన పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనే పశు పోషకులకు మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) మాట్లాడుతూ ఒంగోలు జాతి పశువుల కనుమరుగుయ్యే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని, వీటి ఉనికిని కాపాడలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఉన్నారన్నారు. ఒంగోలు జాతి పశుసంపద, రైతుల దుస్థితిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళేందుకు కృషి చేయడం జరుగుతుందని కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) చెప్పారు. కాగా సబ్ జూనియర్స్ విభాగంలో గుంటూరు జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోటి శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత మొదటి స్థానంలో, గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన పులగం అషిగ్నారెడ్డి, తెలంగాణా రాష్ట్రంలో నాదరుల్కు చెందిన యెలుచల ప్రసన్నారెడ్డి ఎడ్ల జత రెండవ స్థానంలో, ప్రకాశం జిల్లా ఉమామహేశ్వరపురం అగ్రహారానికి చెందిన పాలగిరి సుధాకరరెడ్డి ఎడ్ల జత మూడవ స్థానంలో, కృష్ణాజిల్లా గుణదలకు చెందిన మండవ వెంకటరత్నం, చేతన్ ఎడ్ల జత నాల్గవ స్థానంలో, ప్రకాశం జిల్లాకు చెందిన బెజవాడ అనూష ఎడ్ల జత ఐదవ స్థానంలో, ఫిరంగిపురానికి చెందిన గుత్తి ఆంజనేయులు, దుర్గికి చెందిన పగడాల వీరమ్మ ఎడ్ల జత ఆరవ స్థానంలో, గుంటూరుకు చెందిన సిరిగిరి విజయలక్ష్మి ఎడ్ల జత ఏడవ స్థానంలో, సీతారాంపురానికి చెందిన దాసరి నారాయణరావు, లింగాయపాలేనికి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్ల జత ఎనిమిదవ స్థానంలో, గణపవరానికి చెందిన గణేష్ రత్తయ్యచౌదరి, చౌపాడుకు చెందిన మానుకొండ రామిరెడ్డి ఎడ్ల జత తొమ్మిదవ స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ. 60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ. 10 వేల నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నాయకులు ఉప్పాల రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, కొల్లి విజయ్, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments