ఎందరో మహనీయుల సుదీర్ఘ పోరాటం, త్యాగ ఫలితంగా లభించిన స్వాతంత్ర్యాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి


 నెల్లూరు, జనవరి 26 (ప్రజా అమరావతి): ఎందరో మహనీయుల సుదీర్ఘ పోరాటం, త్యాగ ఫలితంగా లభించిన స్వాతంత్ర్యాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. 

  బుధవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలోని వంద అడుగుల స్తూపం వద్ద 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన కలెక్టర్ అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తులు స్వాతంత్ర్యం కోసం వారి ధన,మాన, ప్రాణాలను పణంగా పెట్టి భారతావనికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించారని,  వారి స్ఫూర్తితో ప్రతిఒక్కరూ దేశ సేవకు ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ కూడా ఈ గొప్ప భారత దేశంలో జన్మించినందుకు గర్వ పడాలని, భారతీయులు ఎక్కడ ఉన్నా, వారి వ్యక్తిగత సామర్ధ్యాలకు అనుగుణంగా దేశానికి సేవ చేసే అవకాశం దొరుకుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక మంచి పరిపాలనను దేశ ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో, దేశపౌరులకు అనేక హక్కులు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఒక గొప్ప నిర్దిష్ట లిఖితపూర్వక అత్యున్నత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనకు అందించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి లభించి ప్రజలందరూ సంతోషంగా జీవితం గడపాలని, ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. 

 ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేంధిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదేహ్ ఖరె, ట్రైనీ కలెక్టర్ శ్రీ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, డిప్యూటీ కలెక్టర్ శ్రీ దాస్, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి శ్రీ వెంకటేశ్వర ప్రసాద్, డిఆర్డిఎ పిడి శ్రీ సాంబశివారెడ్డి, కలెక్టరేట్ ప్రాంగణంలోని కార్యాలయాల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 


Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image