వైఎస్సార్ జలకళ కింద బోర్లు వేసే కార్యక్రమం వేగవంతం చేయాలి

 *వైఎస్సార్ జలకళ కింద బోర్లు వేసే కార్యక్రమం వేగవంతం చేయాలి*


*: జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి*


అనంతపురం, జనవరి 07 (ప్రజా అమరావతి) :


*వైఎస్సార్ జలకళ కింద బోర్లు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఛాంబర్ లో వైఎస్సార్ జలకళ, ఎస్డబ్ల్యూపిసి షెడ్ల నిర్మాణం, ఎన్ఆర్ఈజీఎస్ లో సామాజిక తనిఖీ తదితర అంశాలపై డ్వామా అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.*


*ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిరి మాట్లాడుతూ వైఎస్సార్ జలకళ కింద దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల్లో వేగంగా బోర్లు వేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. వైఎస్సార్ జలకళ కింద బోర్ వేసే కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా 100 రోజుల ఐఈసి యాక్టివిటీలను చేపట్టాలని, నూతన ఎస్డబ్ల్యూపిసి షెడ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలని, రిపేర్లు ఉన్న ఎస్డబ్ల్యూపిసి షెడ్లను త్వరితగతిన రిపేర్లు పూర్తి చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా సామాజిక తనిఖీ చేసేటప్పుడు ఎక్కడైనా తప్పు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సామాజిక తనిఖీలలో మరింత పురోగతి చూపించాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద పడుతున్న కన్వర్జెన్స్ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ కింద లేబర్ మొబిలైజేషన్, లేబర్ బడ్జెట్ తదితర అంశాలపై నిరంతరం మానిటర్ చేయాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ ఈ భాగ్యరాజ్, డ్వామా ఏపిడిలు, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డ్వామా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.