గుంటూరు (ప్రజా అమరావతి);
"అన్నా అంటే నేనున్నా అంటూ " యువతరానికి మార్గదర్శిగా నవతరానికి డిక్సుచిగా కార్యకర్తలు మరియు ప్రజల గుండెల్లో చురస్మరణీయమైన స్థానం పొందిన వ్యక్తి నారా లోకేష్
అని గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ తెలిపారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో గల వికలాంగుల,అందుల వసతిగృహంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించి నారాలోకేష్ భవిష్యత్‌లో ప్రజాపక్షనేతగా ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజలు శ్రేయస్సుకు పాటుపడేలా భగవంతుడు దీవించి మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చూడాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సాయి కృష్ణ మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ సుశిక్షితులైన సైనికులైన కార్యకర్తలు సంక్షేమం కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకొచ్చే వ్యక్తి నారా లోకేష్ గారు అని ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం సంపాదించిన యువ నేత మరియు పంచాయతీ రాజ్ శాఖామంత్రిగా రాష్ట్రం లోని దాదాపు అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయించి రాష్ట్ర గ్రామ ప్రజలు మనస్సుల్లో ఆరాధన భావం కలిగించి ఎంత ఎత్తుకు ఎదిగిన మూలాలు మరవని యువ నాయకుడు మరియు ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో ఐటీ కంపెనీలు మన రాష్ట్రంలో ప్రారంభింప జేసి సాంకేతిక నిపుణులు స్వప్నాలు నిజం చేసిన ఉన్నత విద్యా వంతుడు అంతే కాకుండా పార్టీ కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా వెంటనే నేనున్నాను అంటూ అపన్నహస్తం అందిస్తున్న వ్యక్తి యువతరానికి మార్గదర్శి నవతరానికి దీక్సూచి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా నియంత ప్రభుత్వం గుండెల్లో నిద్రపోయే సింహస్వప్నం లోకేష్ గరే అని కొనియాడారు. భవిష్యత్‌లో ప్రజాశ్రేయస్సుకై ప్రజాపక్ష నేతగా ముందుకు సాగుతూ ఆయురారోగ్యాలతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగులమీరా(బాబు) ఆధ్వర్యంలో బస్టాండ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పండ్ల పంపిణి కార్యక్రమంలో గుంటూరు తూర్పు టిడీపీ ఇంచార్జ్ మొహమ్మద్ నసీర్ గారు , మైనార్టీ నాయకులు షేక్ షబ్బీర్ గారు మరియు తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిరోజ్ లతో కలిసి కేకు కోసి పండ్లు పంపిణి చేసారు.ఈ సందర్భంగా పార్లమెంట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా బాబు మాట్లాడుతూ మైనారిటీలకు తోబుట్టువుగా హేళన చెక్కిన శిల్పం మాదిరిగా తన పని తీరుతో విమర్శకుల నోర్లమూయించిన అటు ప్రజలు ఇటు కార్యకర్తల హృదయాల్లో చెరిగిపోయాని స్థానం సంపాదించిన వ్యక్తి నారా లోకేష్ గారు అని తెలిపారు.
అనంతరం శ్రీనగర్ లో రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షుడు ఫిరోజ్ అధ్వర్యంలో లో జరిగిన అన్నదానంలో అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ మరియు కార్పొరేటర్ ముప్పవరపు భారతి గార్లతో కలిసి కేక్ కోసి వృద్దులకు అన్నదానం చేసారు. ..
ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ యువత స్ఫూర్తిదాతగా ఉన్నత విద్యావంతుడిగా సమాజం పట్ల ప్రజా సమస్యల పట్ల ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్న వ్యక్తి నారా లోకేష్ అన్న అని కొనియాడారు.
అనంతరం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిభిరంలో పాల్గొని నాయకులతో కలిసి రక్తదాతలకు సర్టిఫికెట్లు పంపిణి చేసారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబు తెలుగుయువత ఉపాధ్యక్షులు కొండెపి శేఖర్ బాబు,కన్నసాని బాజీ,అధికార ప్రతినిధులు సింగంశెట్టి శివకుమార్,మొహమ్మద్ సీఫ్,కార్యదర్శి గ్యాలం హనుమంతరావు,గుంటూరు తూర్పు తెలుగుయువత అధ్యక్షులు అఫ్రోజ్,ఐటిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మంచోడు మని,ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంచమర్తి శేషు,తెలుగు యువత పార్లమెంట్ ప్రచార కార్యద్శి చెరుకుపల్లి నాగరాజు,తెలుగు యువత నాయకుల గుత్తికొండ కిరణ్,మల్లెంపటి ప్రభాకర్, సాదినేని గోపినాథ్,సయ్యిద్ ఫిరోజ్,రోషన్,బత్తుల శశి, తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నవ వెంకటేశ్వర రావు,మచ్చు దేవ, రమేష్, రాంబాబు, హనుమంతు రావు, తెలుగు యువత నాయకుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.