ధర్డ్ వేవ్ కోసం ఆసుపత్రులు సిద్దంగా వుంచాలి

 

ధర్డ్ వేవ్ కోసం ఆసుపత్రులు సిద్దంగా వుంచాలి

       జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి

విజయనగరం, జనవరి 05 (ప్రజా అమరావతి)


:   కోవిడ్ ధర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి వైద్య సిబ్బంది, ఆసుపత్రులు సిద్దంగా వుండాలని జిల్లా కలెక్టర్ మరియు ఆసుపత్రుల అభివృద్ది సంఘం ఛైర్మన్ ఎ. సూర్యకుమారి తెలిపారు.  బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఆసుపత్రుల అభివృద్ది సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ ధర్డ్ వేవ్ కోసం ఆసుపత్రులలో పడకలను, వైద్యులను, సిబ్బందిని, మందులు, ఆక్సిజన్ తదితర సామగ్రిని ఇప్పిటినుండే సన్నద్దం చేసుకోవాలని ఆదేశించారు.  ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామరాజు మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో వున్న ఆక్సిజన్ పాయింట్స్ ను 70 నుండి 303కు పెంచడం జరిగిందని తెలిపారు.   ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో 128 బల్క్ ఆక్సిజన్ సిలండర్లు, 108 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వున్నాయని వివరించారు.  ఆసుపత్రిలో 200 బెడ్స్ వున్నాయని, 300 మంది వరకు ఒకేసారి ఏర్పాటు చేయవచ్చునని తెలిపారు. కోవిడ్ రెండవ  దశలో 10 కిలో లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్ ను ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   ఎనస్తీషియా, టెక్నిషియన్లు జిల్లా ఆసుపత్రిలో లేనందున స్టాప్ నర్సులకు ఎనస్తీషియా,  టెక్నిషియన్లు ట్రైయినింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల అభివద్దికి జూలై నుంచి జవనరి వరకు అయిన ఖర్చులను కమిటీ ఆమోదించింది.

    ఈ సమావేశంలో  జాయింట్ డా. మహేష్ కుమార్, డిసిహెచ్ఎస్ డా.నాగభూషణరావు, డిఎం అండ్ హెచ్ ఓ డా. మోహనరావు, మున్సిపల్ కమిషనర్ వర్మ, సభ్యులు డా.వి.ఎస్. ప్రసాద్, డా.కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొనారు.