శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి): ఈ నెల 14 నుంచి 16 వ తేది వరకు సంక్రాంతి పండుగ సందర్భముగా ఈరోజు అనగా ది.14-01-2021 ఉదయం   దేవస్థానము నందు సాంప్రదాయబద్దముగా గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, మేలములు, బోగి మంటలు తో వైభవముగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయినవి. ఈరోజు ఉదయం ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో  శ్రీయుత  ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ , పాలకమండలి సభ్యులు శ్రీమతి ch. నాగ వేంకట వరలక్ష్మి , ఆలయ అధికారులు ఆలయ వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా భోగి మంటలు ప్రజ్వలన చేసి, ప్రదక్షిణలు చేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించి, గోమాత పూజ నిర్వహించి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహామండపం 07 వ అంతస్తులోని పెద్ద రాజ గోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మకొలువు, మరియు ఇతర ఏర్పాట్లను  ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు దంపతులు మరియు కార్యనిర్వహణాధికారి   ప్రారంభించడం జరిగినది. భోగి సందర్భముగా అమ్మవారి దర్శనార్థము విచ్చేసిన భక్తులు దేవస్థానము వారు ఏర్పాటు చేసిన భోగి మంటలు, బొమ్మకొలువు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు మరియు గంగిరెద్దుల విన్యాసాలు చూసి ఆనందించారు. ఈరోజు(14-01-2021) సాయంత్రము పెదరాజ గోపురం ఎదురుగా ఉన్న బొమ్మలకొలువు వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తుల వద్ద చిన్నపిల్లలకు ఈరోజు సాయంత్రం 5 గ.లకు భోగి పళ్ళు పోయడం జరుగునని, కావున భక్తులు కోవిడ్ నియమములు పాటిస్తూ ఈ కార్యక్రమము నందు పాల్గొనవచ్చని ఆలయ చైర్మన్  మరియు కార్యనిర్వహణాధికారి వారు ఈ సందర్భంగా తెలిపారు . ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి గారితో పాటు వైదిక కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీ కె. వి.ఎస్.కోటేశ్వరరావు , శ్రీమతి లింగం రమాదేవి , ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు,  పర్యవేక్షకులు, మరియు ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.