ఓటీఎస్ లబ్ధిదారుల వివరాలు సంబంధించిన తహసీల్దార్ ల లాగిన్ లోకి తీసుకోవడం జరిగిందికొవ్వూరు (ప్రజా అమరావతి);


కొవ్వూరు డివిజన్ పరిధిలో 23,587 మంది ఓటీఎస్ లబ్ధిదారుల వివరాలు సంబంధించిన తహసీల్దార్ ల లాగిన్ లోకి తీసుకోవడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.మల్లిబాబు తెలిపారు.


బుధవారం ఏలూరు నుంచి జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా, జేసి (సంక్షేమం) పి. పద్మావతి లు కొవ్వూరు డివిజన్ అధికారులతో ఓటీఎస్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని ఓటిఎస్ లబ్దిదారులలో 6,920 మంది జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంలో భాగంగా చెల్లింపులు చేసారని తెలిపారు. జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు మిగిలి ఉన్న 16,667 మంది లబ్దిదారులకి ఓటీఎస్ పధకం యొక్క ప్రయోజనాన్ని వివరించి, అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల స్థాయి అధికారులతో నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయడం జరుగుతుందని ఆర్డీవో తెలిపారు. మండల స్థాయి అధికారుల ద్వారా ,గ్రామ/వార్డు సచివాలయాలు వారీగా అర్హత కలిగి ఉన్న లబ్దిదారుల జాబితా మేరకు సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వారి తణుకు పర్యటన సందర్భంగా ఏప్రిల్ వరకు ఓటీఎస్ పొడిగింపు కు అవకాశం ఉన్నప్పటికీ, అంతకుముందే లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  అనంతరం మండల స్థాయి అధికారులతో ఆర్డీవో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.  లబ్దిదారుల్లో డ్వాక్రా మహిళలకు చెందిన లబ్దిదారులకి బ్యాంకుల ద్వారా పావలా వడ్డీ రుణాలు మంజూరు కు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.ఈ సమావేశానికి హౌసింగ్ ఈఈ సీహెచ్. బాబూరావు, డీఎల్ డిఓ పి.జగదాంబ, తహసీల్దార్ బి.నాగరాజు నాయక్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.