అగ్రవర్ణాలలో కూడా పేదవారు ఉన్నారని గుర్తించి మీరు సాయం చేస్తున్నారు.


అమరావతి (ప్రజా అమరావతి);


*వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం*


*క్యాంప్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*శ్రీదేవి, లబ్ధిదారు, కర్నూలు* 


సార్‌ మాది కర్నూలు, మేం ఈబీసీ నేస్తం క్రింద 15 వేలు సహాయం పొందడానికి అర్హురాలినయ్యాను, చాలా ధన్యవాదాలు సార్, నా భర్త చిన్న గుమాస్తాగా పనిచేస్తున్నారు, మేం చాలా కష్టపడి పైకి వస్తున్నాం. నాకు ఒక సోదరుడిలా మీరు ఈ సహాయం చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా అగ్రవర్ణాలలో కూడా పేదవారు ఉన్నారని గుర్తించి మీరు సాయం చేస్తున్నారు.మా అమ్మ కూడా ఫించన్‌ తీసుకుంటుంది, నా కొడుకులాగా ధన్యవాదాలు తెలపమని అమ్మ చెప్పింది, మా అమ్మ తరపున కూడా మీకు ధన్యవాదాలు. విద్యా దీవెనలో మా అబ్బాయికి సాయం అందింది, చక్కగా చదివించుకుంటున్నాం, మేం మీకు రుణపడి ఉంటాం, దిశ యాప్‌ గురించి కూడా మాకు వలంటీర్లు చెప్పారు, మేం ధైర్యంగా బయటికి వెళుతున్నాం, రేషన్‌ కూడా ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు, మీరు ప్రవేశపెట్టిన పథకాలు చాలా బావున్నాయి, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, మీరే మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, ధ్యాంక్యూ సోమచ్‌ సార్‌.


*కొవ్వూరి లక్ష్మి, లబ్ధిదారు, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా*


అన్నా నేను ఈబీసీ పథకానికి అర్హురాలినయ్యాను, ఓసీల్లో పేదవారున్నారని మీరు గుర్తించారు. ఈ పథకం మాకు చాలా అవసరం, వలంటీర్‌ ఇంటికి వచ్చి మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పి ఇస్తున్నారు, నేను బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేస్తున్నాను, నాకు ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది.  మీరు సీఎం అయిన తర్వాత నా భర్తకు కూడా పెన్షన్‌ వస్తుంది, ఆయన పెరాలసిస్‌తో ఇబ్బంది పడుతున్నారు. నాకు సొంత ఇల్లు లేదు, కానీ ఇప్పుడు నాకు సొంతింటి కల నెరవేరింది, నా భర్త అనారోగ్యం వల్ల రేషన్‌కి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు రేషన్‌ ఇంటి వద్దే తీసుకుంటున్నాను. నవరత్నాల పథకాలు మాకు అందుతున్నాయి, మేం చాలా రుణపడి ఉంటాం, మేం ఆత్మవిశ్వాసంతో బతకడానికి చాలా సహాయం చేస్తున్నారు. ప్రాణాలున్నంత కాలం మేం ఎవరి మీద ఆధారపడకుండా మీరు భరోసా కల్పించారు. మీరు మహిళలందరినీ ముందుండి నడిపిస్తున్నారు. మా మహిళలందరి తరపునా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సెలవు అన్నా.


*తూమాటి నాగజ్యోతి, లబ్ధిదారు, గుంటూరు*


అన్నా నేను ఈబీసీ నేస్తంకు ఎంపికయ్యాను అని తెలిసి చాలా సంతోషించాను. ఇప్పటివరకూ మా ఓసీలకు సంక్షేమ పథకం లేదనుకున్నాను కానీ ఇప్పుడు ఈబీసీ పధకం మాకు ఉంది. నేను ఈ డబ్బుతో శారీ పెయింటింగ్‌ బిజినెస్‌ చేసుకుంటాను. నా అన్న ఇచ్చిన డబ్బుతో నేను ధైర్యంగా వ్యాపారం చేసుకుని నా కాళ్ళపై నేను నిలబడతాను. గ్రామ సచివాలయ వ్యవస్ధ చాలా బావుంది, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఏకైక సీఎం మీరేనన్నా...ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రతీ పథకం పొందుతున్నాను. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం మీరు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన ఘనత కూడా మీదేనన్నా, వారందరి ఆశీస్సులు మీకు ఉంటాయి. సొంతింటి కల నెరవేరుస్తున్నారు, మేం చాలా సంతోషంగా ఉన్నాం. మా అగ్రవర్ణ పేదలకు మీరు చాలా సాయం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మా మహిళలంతా మా అన్న ఉన్నారనే ధైర్యంతో ఉన్నాం, మళ్ళీ మళ్ళీ కూడా మీరే సీఎం అవ్వాలి, మీ చల్లని పాలనలో మేం కూడా చల్లగా ఉంటామన్నా...ధ్యాంక్యూ అన్నా.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image