గో ఆధారిత వ్యవసాయంపై రైతులను ప్రోత్సహిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి
- గో ఆధారిత వ్యవసాయంపై రైతులను ప్రోత్సహిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి


 

- మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని 

- కే. కన్వెన్షన్లో అత్యంత వైభవోపేతంగా గోపూజ గుడివాడ, జనవరి 11 (ప్రజా అమరావతి): గో ఆధారిత వ్యవసాయంపై సీఎం జగన్మోహనరెడ్డి రైతులను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్ లో  గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోవుకు పూజలు చేశారు. అనంతరం కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) మాట్లాడుతూ భారతీయ ఆలయ సంస్కృతికి, దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజ ఆరోగ్యానికి గోవును మూల స్తంభంగా పురాణాలు చెబుతున్నాయన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో ఒకప్పుడు గోమాత కీలకపాత్ర పోషించిందని తెలిపారు. గో మూత్రం, పేడ ఎరువుగా పండించిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం, ఆవు పాలు తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారని, పలు వ్యాధుల నివారణకు గో పంచగవ్యాలను మందులుగా కూడా ఉపయోగించేవారన్నారు. దీనివల్ల ప్రజలు ఆధునిక వైద్యం వైపు చాలా అరుదుగా వెళ్ళేవారని చెప్పారు. సమాజంలో చోటు చేసుకున్న నూతన పోకడలు, అవసరానికి మించి వ్యవసాయ యాంత్రీకరణ, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, కలుపు నివారణ మందుల వాడకం వల్ల గాలి, నీరు, నేల కలుషితమయ్యాయన్నారు. దేశం ఆర్ధికంగా, ధార్మికంగా, ఆరోగ్యపరంగా బాగుపడాలంటే గో సంరక్షణ ఏకైక మార్గమని, గోవులను పూజించడం, సంరక్షించడం మనందరి కర్తవ్యమని చెప్పారు. సనాతన హిందూ ధర్మంలో గోమాతకు విశిష్ఠ స్థానం ఉందన్నారు. మానవజాతి మనుగడకు గోమాత ఎంతో సేవ చేస్తుందన్నారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు గో పరిరక్షణ చేయడం వల్ల రామరాజ్య స్థాపనతో పాటు సుపరిపాలన అందించారని చెప్పారు. ద్వాపరయుగంలో పాండవులు, అజ్ఞాతవాస కాలంలో గో పరిరక్షణ చేయడం వల్ల తిరిగి తమ రాజ్యాన్ని పొందగలిగారని చెబుతుంటారన్నారు. గోమాతను సంరక్షించుకుని భూమాతను పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Comments