ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక ఆక్సీజన్‌ సౌకర్యాలు

 

అమరావతి (ప్రజా అమరావతి);


*ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక ఆక్సీజన్‌ సౌకర్యాలు


*


*నేడు క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చవల్‌గా ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, చికిత్స పొందిన రోగులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), డిప్యూటీ సీఎం (వైద్య,ఆరోగ్యశాఖ)*


ఈ రోజు కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక ముఖ్య ఘట్టం ప్రారంభమవుతుంది. దేశంలో మరే ఇతర రాష్ట్రాలలో లేని విధంగా మన సీఎంగారు ప్రజల ప్రాణాల రక్షణకు, ఆరోగ్య భద్రతకు వేల కోట్లు వెచ్చించారు. కోవిడ్‌ను మనం ఎంతగా మేనేజ్‌ చేసినా ఆక్సీజన్‌ సప్లై కోసం కేంద్రంపై ఆధారపడటం, ఇతర రాష్ట్రాల నుంచి కోటా మేరకు పొందడం గతంలో చూశాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సీఎంగారు ప్రజలందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా ముందుకుసాగారు. భవిష్యత్‌లో కోవిడ్‌ ఎన్ని దశలు వచ్చినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని, ఆక్సీజన్‌ కొరత రాకుండా ఉండేలా ఆలోచించి ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అతి తక్కువ సమయంలో యుద్దప్రాతిపదికన ఆక్సీజన్‌ ప్లాంట్లను నిర్మించి ప్రజలకు చేరువ చేసిన సీఎంగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్ని వేవ్‌లు వచ్చినా కూడా, ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వెనుకంజ వేయకుండా ముందుకు సాగుతున్నారు మన సీఎంగారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్రజారోగ్యరంగం నిర్వీర్యమైపోయింది. కానీ ఈ ప్రభుత్వం దాదాపు 16 వేల కోట్లతో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, ఆసుపత్రుల ఆధునీకరణ, పూర్తి స్ధాయి సిబ్బంది, ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసింది. భవిష్యత్‌లో ఎన్ని వేవ్‌లు వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించిన సీఎంగారికి హృదయపూర్వక ధన్యవాదాలు.


*డాక్టర్‌ కిరణ్, మెడికల్‌ ఆఫీసర్‌æ, పుంగనూరు సీహెచ్‌సీ, చిత్తూరు జిల్లా*


సీఎం సార్‌ మా వైద్య సిబ్బంది తరపున మీకు హృదయపూర్వక నమస్కారాలు. సార్‌ ఈ రోజు మా అందరికీ సంతోషకరమైన రోజు. మా చిత్తూరు జిల్లాలో 27 పీఎస్‌ఏ ఆక్సీజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో మా పుంగనూరు ఆసుపత్రిలో పీఎస్‌ఏ ప్లాంట్‌ రావడం మాకు, మా ప్రాంత ప్రజలకు సంతోషకరం. గతంలో ఆక్సీజన్‌ లేక రోగులను చిత్తూరు, తిరుపతి పంపేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజలకు ఇక్కడే వైద్యం అందించగలుగుతున్నాం. మీ ముందుచూపుతో దేశంలోనే అత్యధికంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగలిగాం. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కూడా బాగా పూర్తిచేశాం. మీరు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారు. టీనేజర్స్‌ వ్యాక్సినేషన్‌ కూడా వంద శాతం పూర్తిచేసే దిశగా ముందుకెళుతున్నాం. కోవిడ్‌ చికిత్స ఎంత ఖరీదయినదో అందరికీ తెలుసు, దేశంలో ఏ సీఎం చేయని విధంగా కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చారు. మీ సపోర్ట్‌తో మేం ఎన్ని వేవ్‌లు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఈ అత్యవసర పరిస్ధితులలో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన మీకు మా వైద్య సిబ్బంది తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సార్, ధ్యాంక్యూ.


*శైలజ, గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందిన రోగి*


సార్‌ మాది మధ్య తరగతి కుటుంబం, నేను సార్‌ అని పిలవడం కంటే నా సొంత అన్నగా పిలవడమే కరెక్ట్‌ అని భావిస్తున్నాను. ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే అది మీరు పెట్టిన బిక్షే, నాకు సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా కరోనా వచ్చి ఆక్సీజన్‌ లెవల్స్‌ 75 కు పడిపోయాయి, మా ఇంట్లో ముగ్గురు, నలుగురికి వచ్చింది, నన్ను జీజీహెచ్‌కి తీసుకురాగానే ఇక్కడి డాక్టర్లు, నర్సులు, స్టాఫ్‌ వెంటనే స్పందించి నన్ను ఐసీయూలో పెట్టారు, అక్కడి ట్రీట్మెంట్‌కు నయమై డిశ్చార్జ్‌ అయ్యాను, మంచి మందులతో పాటు మంచి భోజనం కూడా పెట్టారు. ఆ టైంలో చాలా కేసులు రావడం వల్ల ఆక్సీజన్‌ దొరకకపోయినా మీరు మాత్రం చక్కగా పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడారు. ఫస్ట్‌ వేవ్‌ లో కూడా లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు లేకుండా వలంటీర్ల ద్వారా అన్నీ అందించారు. ప్రజల ప్రాణాలకు మీరు ఒక చత్రపతిగా, మా ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఆక్సీజన్‌ కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలు చాలా సంతోషం, మీకు కృతజ్ఞతలు. మా గురించి నిరంతరం ఆలోచించే మీరు, మీ కుటుంబ సభ్యులు అంతా ఆరోగ్యంగా, బాగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


*రవికుమార్, అనస్ధీషియా టెక్నీషియన్, విమ్స్, విశాఖపట్నం*


సార్‌ గత ఏడాది కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సీజన్‌ కొరత ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు. మీరు ఆక్సీజన్‌ ప్లాంట్స్‌ అవసరాన్ని గుర్తించి ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్స్‌ వల్ల వచ్చే ఆక్సీజన్‌ 90 – 96 శాతం స్వచ్చమైన ఆక్సీజన్‌ రోగులకు అందించవచ్చు. అంతేకాక ప్రతీ ఆసుపత్రిలో బల్క్‌ ఆక్సీజన్‌ సిలెండర్లు, లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సీజన్‌ కూడా అందుబాటులో ఉంది, వాటిలో ఏదైనా అంతరాయం కలిగితే ఈ పీఎస్‌ఏ ఆక్సీజన్‌ ప్లాంట్స్‌ ఉపయోగపడతాయి. ఈ ప్లాంట్ల వలన కొండ ప్రాంతాలైన అరకు, పాడేరు వంటి ప్రాంతాలకు చాలా ఉపయోగకరం, ఇందులో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ, మీ సహాయ సహాకారాలతో మేం ధర్డ్‌ వేవ్‌ను కూడా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాం. ఈ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మీరు అండగా నిలిచినందుకు మీకు రుణపడి ఉంటాం సార్, ధ్యాంక్యూ

Comments