భారత ప్రధాన న్యాయమూర్తి కి స్వాగతం పలికిన టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, సివిఎస్వో

 భారత ప్రధాన న్యాయమూర్తి కి స్వాగతం పలికిన టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, సివిఎస్వో


తిరుమల 12 జనవరి (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి గౌ. జస్టిస్ ఎన్వీ రమణ కు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, స్వాగతం పలికారు.

శ్రీ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి కి వీరు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తో పాటు పలువురు న్యాయమూర్తులు కూడా భారత ప్రధాన న్యాయమూర్తి కి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.