సీనియర్స్ విభాగంలో జ్ఞాన భవ్య, నిర్విగ్నశ్రీ ఎడ్ల జతకు ప్రథమస్థానం



- సీనియర్స్ విభాగంలో జ్ఞాన భవ్య, నిర్విగ్నశ్రీ ఎడ్ల జతకు ప్రథమస్థానం 



- జూనియర్స్ లో తెలంగాణా ఎడ్ల జతకు మొదటి స్థానం 

- మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని 

- ఎమ్మెల్యే కైలేతో కలిసి విజేతలకు నగదు అందజేత 



గుడివాడ, జనవరి 17 (ప్రజా అమరావతి): జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీల్లో భాగంగా నిర్వహించిన సీనియర్స్ విభాగంలో కృష్ణాజిల్లా నున్నకు చెందిన బొంతు జ్ఞాన భవ్య, నిర్విగ్నశ్రీ ఎడ్ల జత ప్రథమస్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) చెప్పారు. గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్ ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా విజేతలకు రూ.4.50 లక్షల నగదు బహుమతులను పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, వైసీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ తో కలిసి కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) అందజేశారు. అలాగే తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన మేకా రామకృష్ణ ఎడ్ల జత రెండవ స్థానంలో, అనంతపురం జిల్లా కూనవుప్పలపాడుకు చెందిన కులశేఖరరెడ్డి, ఎస్. కొత్తూరుకు చెందిన బీఎస్ఎస్ రెడ్డి ఎడ్ల జత మూడవ స్థానంలో, వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలేనికి చెందిన గుంటుపల్లి మహేష్ రెడ్డి ఎడ్ల జత నాల్గవ స్థానంలో, కర్నూలు జిల్లా జిల్లేళ్ళకు చెందిన గొటికే రవితేజశ్వరరెడ్డి, దుర్గికి చెందిన పగడాల వీరమ్మ ఎడ్ల జత ఐదవ స్థానంలో, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెద పులిపాకకు చెందిన గరికిపాటి ఝాన్సీ, లాస్య ఎడ్ల జత ఆరవ స్థానంలో, నవులూరుకు చెందిన బత్తుల మౌనిష్ యాదవ్, సితారా యాదవ్ జత ఏడవ స్థానంలో, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సత్యవోలుకు చెందిన బత్తుల బాలరాజు, నవులూరుకు చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత ఎనిమిదవ స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.లక్ష, రూ. 80 వేలు, రూ.70 వేలు, రూ. 60 వేలు, రూ.50 వేలు, రూ. 40 వేలు, రూ.30 వేలు, రూ. 20 వేల నగదు బహుమతులను అందజేయడం జరిగింది. అలాగే జూనియర్స్ విభాగంలో తెలంగాణా రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా రామకృష్ణాపురానికి చెందిన పోతిరెడ్డి శ్యామసుందరరెడ్డి ఎడ్ల జత మొదటి స్థానంలో, గుంటూరు జిల్లా లింగాయపాలేనికి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్ల జత రెండవ స్థానంలో, కృష్ణాజిల్లా ఘంటసాలకు చెందిన మేకా కృష్ణమోహన్, వేమూరి మౌర్యచంద్ర ఎడ్ల జత మూడవ స్థానంలో, ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన పోపూరి శ్రీనివాసరావు ఎడ్ల జత నాల్గవ స్థానంలో, గుంటూరు జిల్లా వరహపురానికి చెందిన మొవ్వా శ్రీనివాసరావు ఎడ్ల జత ఐదవ స్థానంలో, కర్నూలు జిల్లా పెసరవాయికి చెందిన సయ్యద్ కలాం భాష ఎడ్ల జత ఆరవ స్థానంలో, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గానుగపంట రాజశేఖరరెడ్డి ఎడ్ల జత ఏడవ స్థానంలో, కే. రాజుపాలేనికి చెందిన యేలూరి కావ్యాచౌదరి, గణేష్ చౌదరి ఎడ్ల జత ఎనిమిదవ స్థానంలో, రామలక్ష్మీపురానికి చెందిన కొప్పుల హేమలతా శ్రీనివాసరెడ్డి, కేసరపల్లికి చెందిన మల్లంపాటి జయకృష్ణచౌదరి ఎడ్ల జత తొమ్మిదవ స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, కొల్లి విజయ్, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ద కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments