*కర్ణాటకలో మూడురోజులపాటు విద్యాసంస్దల బంద్*
కర్ణాటక (ప్రజా అమరావతి);
కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనలకు దారితీయడం ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో స్కూళ్లు, కళాశాలలను మూడు రోజులపాటు మూసేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని కోరారు.
ఉడిపి కుందాపూర్ లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని హిందూ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో చినిచినికి గాలివానగా మారిన వివాదం చివరికి హింసాత్మక ఘటనలకు దారితీసింది. శివమొగ్గలోని బాపూజీనగర్ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల పరిసర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు నేడు (మంగళవారం) లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు విద్యార్థులు జూనియర్ కళాశాల సమీపంలోని ప్రైవేటు బస్సులపై రాళ్లు రువ్వారు.
ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితి మరింత విషమించకుండా శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
addComments
Post a Comment