గుంటూరు రూరల్ పోలీస్. (ప్రజా అమరావతి);
భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకునే విధంగా విధులు నిర్వర్తించండి.
ది.01.03.2022 తేదీన కోటప్పకొండ తిరునాళ్ళ ఉత్సవాలకు బందోబస్తు నిర్వహించడానికి హాజరైన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి కోటప్పకొండ నందు గల జిల్లా పరిషత్ పాఠశాలలో బందోబస్తు విధుల గురించి బ్రీఫింగ్ నిర్వహించిన గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు,.
ఈ సందర్బంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ ....
శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి కోటప్పకొండ తిరునాళ్ళ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చేయవలసిన అన్ని ఏర్పాట్ల గురించి గత పదిహేను రోజుల నుండి గౌరవ జిల్లా కలెక్టర్ ,నేను,మా డీఎస్పీ ,సీఐలు మరియు ఎస్సై లు పలు మార్లు సమీక్షలు నిర్వహించడం జరిగినది.
రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ *తిరునాళ్ళ ఉత్సవాలకు మొత్తం 2700 మంది పోలీస్ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నాము* కావున ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని మా పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించి,పలు సూచనలు ఇవ్వడం జరిగినది.
తిరునాళ్ళ ఉత్సవాలకు విచ్చేసే భక్తులతో సున్నితంగా వ్యవహరించాలని,ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలనీ సూచించడం జరిగినది.
దేవుని దర్శనానికి విచ్చేసే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా,వాహనాల పార్కింగ్ ప్రదేశాల వద్ద,ప్రభల ప్రదర్శన ప్రాంతాల్లో, ముఖ్యాంగా దేవుని దర్శించుకునే సమయంలో జన సందోహం స్థంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని మా పోలీస్ వారికి సూచించడం జరిగినది.
మునుపెన్నడూ లేని విధంగా గత సంవత్సరం ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవకుండా మా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది విధులు నిర్వర్తించారని,ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే విధులు నిర్వర్తిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాను.
తిరునాళ్లకు విచ్చేసే భక్తులు మరియు ప్రజలు పోలీస్ వారికి సహకరించి, తిరునాళ్ళను విజయవంతం చేయడానికి కృషిచేయాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీగారితో పాటు రూరల్ జిల్లా అదనపు ఎస్పీ(AR) రాజు ,డిఎస్పీ లు,సీఐ లు,ఎస్సై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.