లోక్ సభ నుంచి విపక్షాలు వాకౌట్..
న్యూఢిల్లీ (ప్రజా అమరావతి): కర్ణాటకలోని ఉడిపిలో చెలరేగిన హిజాబ్ వివాదం పార్లమెంట్‌ను సైతం తాకింది. మంగళవారం ఈ విషయమై లోక్‌సభలో చర్చ జరిగింది. అయితే కేంద్రంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి.
ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించకపోవడంతో విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్ సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, జేఎంఎం పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా, కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో స్కూళ్లు, కళాశాలలను మూడు రోజులపాటు మూసేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా హిజాబ్ వివాదం చెలరేగుతోంది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని హిందూ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో చినిచినికి గాలివానగా మారిన వివాదం చివరికి హింసాత్మక ఘటనలకు దారితీసింది.
addComments
Post a Comment