*“సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలతో చర్చకు వెళ్లిన వైకాపా నాయకులు
”*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సోమిరెడ్డి పాల్పడిన అవినీతికి బలి అయిన బాదితులను వెంటపెట్టుకునివెంకటాచలం మండల తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లిన మండల వైకాపా నాయకులు.*
*సోమిరెడ్డి అవినీతికి ఆహుతి అయిన బాధితులతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు బైఠాయింపు.*
*సోమిరెడ్డి అవినీతికి, అక్రమాలకు బలి అయిన బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడి.*
*సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు , సోమిరెడ్డి బాధితులు అందరితో వచ్చి నిజానిజాలు నిగ్గు తేల్చుదామని కోరినా తెలుగుదేశం నాయకులు స్పందించడం లేదంటూ వైకాపా నాయకుల ఆగ్రహం.*
*సోమిరెడ్డి ని నమ్మి నిట్టనిలువునా మోసపోయామంటూ ఆవేధనతో భాదితుల ఆందోళన .*
*తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు “జై జగన్ - జై కాకాణి ” నినాదాలతో దద్దరిల్లిన ప్రాంతం.*
*వెంకటాచలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం అందరూ రావాలంటూ సోమిరెడ్డి పిలుపునిచ్చినా , ఫోన్లు చేసినా మొక్కుబడిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు .*
*నియోజకవర్గ వారీగా తరలిరావాలంటూ సోమిరెడ్డి పిలుపుకు తెలుగుదేశం పార్టీ నాయకులలో కానరాని స్పందన.*
*మీడియా సమావేశం పెట్టడం ఉన్నవీ లేనివీ సోమిరెడ్డి వాట్సాప్ ద్వారా ప్రచారం చెయ్యడం కాకుండా బహిరంగ చర్చకు వస్తే తెలుగుదేశం నాయకులు తోకముడిచారు అంటూ వైకాపా నాయకుల ఎద్దేవా.*
*పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాధం .*
*"వైకాపా నాయకుల స్క్రోలింగ్ పాయింట్స్"*
సర్వేపల్లి నియోజకవర్గంలో "సోమిరెడ్డి హయాంలో జరిగిన అవినీతి పై బహిరంగ చర్చకు సిద్ధపడి నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చినా తెలుగుదేశం పార్టీ నాయకులు తోకముడిచి పలాయనం చిత్తగించారు .
సోమిరెడ్డి నియోజకవర్గ వారీగా తెలుగుదేశం నాయకులు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చినా రౌడీ షీటర్లు , పిక్ పాకెట్ గాళ్ళు , దొంగలు తప్ప నాయకులు ఎవ్వరూ కనిపించలేదు .
సోమిరెడ్డికి గతిలేక స్థానికంగా ఉండే నాయకులు సోమిరెడ్డి పట్ల నమ్మకం , విశ్వాసం కోల్పోయి పార్టీ వ్యవహారాలకు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గం వదిలి వలస వెళ్లిన వారితో మొక్కుబడిగా విలేకర్ల సమావేశం నిర్వహిస్తున్నారు .
సోమిరెడ్డి షిప్ట్ ఆపరేటర్లు పోస్టులు , అంగన్వాడీ టీచర్ల పోస్టులు, అంగన్వాడీ ఆయాల పోస్టులకు , రేషన్ డీలర్ల నియామకం చేయిస్తానని డబ్బులు వసూలు చేసిన బాధితులను సోమిరెడ్డిని నిలదీయడానికి మా వెంట తీసుకుని వచ్చాం .
సోమిరెడ్డి పోస్టింగులు ఇప్పిస్తాం అంటూ దళితుల దగ్గర, వెనుకబడిన వర్గాల దగ్గర డబ్బులు వసూలు చేసి పోస్టింగులు ఇవ్వకుండా అడిగితే ముఖం చాటేస్తుండటంతో అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సోమిరెడ్డికి సమర్పించి మోసపోయిన బాధితులు బావురుమంటున్నారు .
సోమిరెడ్డి హామీతోనే సోమిరెడ్డి కొడుకు రాజగోపాల్ రెడ్డికి తాము డబ్బులు చెల్లించాం అని పని కాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వమని ప్రాధేయపడితే, సోమిరెడ్డి తనకు సంబంధం లేదు అంటూ అల్లీపురం ఇంటికి వెళితే మెడపట్టి బయటికి గెంటేస్తానని బెదిరిస్తున్నాడని , సోమిరెడ్డి కొడుకు ఫోన్ తీయకపోవడంతో గత్యంతరం లేక బాధితులు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ముట్టడికి తరలివచ్చారు.
సోమిరెడ్డి వల్ల నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యం అంటున్న సోమిరెడ్డి బాధిత కుటుంబాలకు ఏదైనా అన్యాయం జరిగితే సోమిరెడ్డి ,సోమిరెడ్డి కుమారుడే బాధ్యత వహించాలి .
సోమిరెడ్డి తెలుగుదేశం పార్టీని అడ్డుపెట్టుకొని అంతులేని అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు .
సోమిరెడ్డి ఇతర రైతుల భూములను వేరొకరికి అమ్మి సొమ్ముచేసుకోవడంతో మోసపోయిన రైతులు కూడా సోమిరెడ్డిని ప్రశ్నించడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు .
సోమిరెడ్డి సమాధానం చెప్పలేక ముఖం చాటేసి తెలుగుదేశం పార్టీ నాయకులను ముందుకు పెట్టి తాను తప్పించుకోవాలని తిరుగుతున్నాడు .
సోమిరెడ్డి అవినీతికి నష్టపోయిన బాధితులకు న్యాయం జరగని పక్షంలో బాధితులను వెంట తీసుకొని జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కలిసి న్యాయం చేయమని వేడుకుంటాం .
సోమిరెడ్డి దిగివచ్చి సోమిరెడ్డి , సోమిరెడ్డి కొడుకు పోస్టింగ్ లు ఇప్పిస్తామని వసూలు చేసిన డబ్బులు వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం .
సోమిరెడ్డి తన తప్పు తెలుసుకొని చెంపలు వేసుకొని బాధిత కుటుంబాలకు డబ్బులు చెల్లించని పక్షంలో సోమిరెడ్డి ఇంటిని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాం .
addComments
Post a Comment