గౌరవ భారత ఉపరాష్ట్రపతి వారికి ఘనస్వాగతం
రేణిగుంట, తిరుపతి, ఫిబ్రవరి 09 (ప్రజా అమరావతి): తిరుపతి, తిరుమల రెండురోజుల పర్యటన నిమిత్తం బుధవారం మధ్యాహ్నం 12.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు గారికి ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ నారాయణస్వామి, తిరుపతి శాసన సభ్యులు శ్రీభూమన కరుణాకర రెడ్డి, ఎం.ఎల్.సి.వాకాటి నారాయణ రెడ్డి, జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ , డిఐజి ఇంచార్జ్ వెంకటరమణా రెడ్డి, డిజి బాబ్జి, అర్బన్ ఎస్.పి. వెంకటప్పలనాయుడు , ఎయిపోర్ట్ డైరెక్టర్ ఎస్.సురేష్, సి.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి, డిప్యూటి కమాండెంట్ శుక్ల , బిజెపి ప్రతినిధులు విష్ణువర్దన్ రెడ్డి , చామంచి శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికిన వారిలో వున్నారు.
addComments
Post a Comment