గుంటూరు జిల్లా (ప్రజా అమరావతి);
వడ్డేశ్వరం లోని కె.ఎల్.విశ్వవిద్యాలయంలో అల్లు బాబి కంపెనీ రెజైన్సెన్స్ పిక్చర్స్ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నిర్మించిన గని చిత్రంలోని పాటను కె ఎల్ విశ్వవిద్యాలయం విద్యార్థులతో లాంఛనంగా ఆవిష్కరించారు. ఇప్పటికే చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. తాజాగా రోమియో జూలియట్ అనే పాటను వినూత్నంగా కె ఎల్ విశ్వవిద్యాలయం విద్యార్థులచే పాటను విడుదల చేశారు
. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రత్యేకంగా వేదికపై స్వయంగా పాటను పాడి వినిపించారు. అనంతరం హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ క్రీడారంగం నేపథ్యంలో నిర్మించిన సినిమాలను ప్రేక్షకులు ఆదరించారన్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న గని చిత్రంలో
మన జాతీయత పెంపొందించే విధంగా ఉంటుందన్నారు. కుటుంబసమేతంగా చూడదగిన చిత్రమని హీరో వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కోరపాటి కిరణ్, హీరోయిన్ సాయి మంజరికా, నిర్మాతలు సింధూ ముధ, అల్లు బాబీ మరియు ఇతర సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment