- కుటుంబ పార్టీలకు ప్రత్యామ్నాయం ఒక్క భారతీయ జనతా పార్టీయే
- ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యం
- మా దగ్గర నిజమైన వెపన్స్ వారి దగ్గర అబద్దాల వెపన్స్ ఉన్నాయి.
- మేం రూలింగ్ చేస్తున్నాము - వారు ట్రేడింగ్ చేస్తున్నారు.
- బూత్ స్థాయి వరకు పార్టి విస్తరణ,
- సంస్థాగతంగా పార్టి బలోపేతం,
- రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేస్తాం.
ఒంగోలు: (ప్రజా అమరావతి):
శుక్రవారం ఉదయం నగరంలోని ఉత్తర బైపాస్ వద్దగల విష్ణుప్రియ కన్వెంషన్ హాలు లో భారతీయ జనతా పార్టి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నిర్వహించిన పాత్రికేయ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పలు అంశాలపై కోట్ల రూపాయల లెక్కలను అంకెలతో సహా తెలుపుచూ సుధీర్ఘంగా, సోదాహరణంగా వివరించారు. విలేఖరులు అడిగిన పలు అంశాలపై సూటిగ సమాధానాలు ఇచ్చారు.
రాష్ట్రంలో మూడు లక్షల కోట్లతో కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి 25వేల కోట్లను మంజూరు కేంద్రం మంజూరు చేసిందని మరల 15వేల కోట్లను అడిగారని అంటే పోలవరం ప్రాజెక్ట్ కు అయ్యేంత ధనం 37వేల కోట్లను ఇచ్చినట్లతుందని వారు తెలుపుచూ గత ప్రభుత్వానికి 35వేల కోట్లు ఈ జగన్ ప్రభుత్వానికి 37వేల కోట్లు ఇవ్వడం అనేది ప్రధాని మోదీకి ఆంధ్ర రాష్ట్రం పై ఉన్న అభిమానమును తెలుపుచున్నదన్నారు. గత ప్రభుత్వ హయాములో 5లక్షల ఇళ్ళను కేటాయించామని, వానిని పూర్తి కానివ్వలేదని ఇళ్లకు కేటాయించిన ధనమును చంద్రన్న బాట తదితర పథకాలకు వాడారని, ఈ ప్రభుత్వము జగనన్న కాలనీల నిర్మాణములో లక్షా 80వేల చొప్పున 32వేల కోట్లు అందిచామని పట్టాలు ఇచ్చిన నెపంతో గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదని వానికోసం 12వేల కోట్లు మంజూరు చేశారని వివరించారు.
ఆహార పదార్ధాల రాయితికై పది వేల కోట్లను అందించడం జరిగిందని వివరిస్తూ ఇంటింటికి ఇస్తున్న బియ్యం 36రూ ఉండగా కేంద్రం 33రూ అందిస్తుండగా రాష్ట్రం 2రూ ను ప్రజలు 1రూపాయలను చెల్లిస్తున్నారని, ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆ రూపాయి భారం కాకుండా పూర్తి ఉచితంగ గత ఒకటిన్నర సంవత్సరముగా అందించిదని తెలిపారు.
ఒటి క్రింద 7వేల 8వందల కోట్లను రాష్ట్రప్రభుత్వం తీసుకొందని చంద్రబాబే లేక్కలు చేప్తున్నారని, కేంద్రం ఇచ్చిన విపత్తు నివారణ నిధులు 3వేల 2వందల రెండు కోట్లను ఈ ప్రభుత్వం ఏం చేసిందో అడగాలని కేంద్రాన్ని తెలుగుదేశం పార్టి పట్టాభి కోరుచున్నారని తెలిపారు. సర్పంచులకు నిధులు ఇవ్వకుండా 26వేల కోట్లను వివిధ పథకాలకు వాడేస్తున్నారని, 1000కోట్ల విద్యుత్ బకాయిలు కట్టకుండా ఆర్ధిక సంఘం ఇచ్చిన 7వేల 6వందల యాభై కోట్లను ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
9వందల మైళ్లు ఉన్న తీరప్రాంతంలో 60:40 కేంద్రం నిధులిస్తాము ఫిషింగ్ హార్బర్లు కట్టమంటే గత ప్రభుత్వం ముందుకు రాలేదని, 14వ ఆర్ధిక సంఘం సిఫారసు 90:10 నిష్పత్తి మేరకు ఈ ప్రభుత్వం నాబార్డు ఋణంతో ఆరింటిని కడుచున్నారని, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రముఖమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు.
బడ్జెట్ లో ఫలానా రాష్ట్రానికి అంటూ పేరు పెట్టి ఉండదని కాని దేశంలోని ప్రతి ఊరికి, ప్రతి ఒక్కరి అభివృద్ధికై పథకాలు రూపొందించడం జరుగుతుందని అంటూ రాష్ట్ర బడ్జేట్ లో ఒంగోలుకు లేక ప్రకాశం జిల్లాకు ఇంత అని పేరు పెట్టి ఉంటుందా! అని ఎద్దేవా చేశారు.
64వేల కోట్లతో రైల్వే లైన్ల ఆధునికీకరణ చేశామని ఆధారాలతో సహా వివరించారు. మేము రూలింగ్ చేస్తున్నాము, మీరు ట్రేడింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని పై మడం తిప్పనన్నోడు వైజాగ్ కు వెళుచున్నాడని, మేము డైరక్ట్ గ ఉన్నాం రండి అంటూ సవాల్ చేశారు.
వ్యాపార ధోరణి తో టిటిడి దర్శనం రేట్లు పెంచుతున్నారని విమర్శించారు. సినెమాల పై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సినెమా టికెట్ల పై ఏ ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, టికెట్ ధరలు తగ్గిస్తూ మందు రేట్లు పెంచడం, దేవుని దర్శనం ధరలను పెంచడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పోవలరం పై గత ప్రభుత్వ ఖర్చులపై బుక్ వేసిన ఈ ప్రభుత్వం ఇంత ఇవ్వండని కోరడం బొక్కెయ్యడినికే అని చమత్కరించారు.
గ్రామ దేవతల జాతరలో ఊరు ఊరంతా పాల్గొని ఒక్కోక్కరు ఒక్కో పని చేసి కార్యక్రమం జయప్రదం చేస్తారని వివరిస్తూ ఉన్నవన్నీ కుటుంబ పార్టీలని, వీటికి కులమతాల అతీతంగా ఉన్న భారతీయ జనతా పార్టియే ప్రత్యామ్నాయమని తెలిపారు.
రష్యా క్షిపణిదాడిలో అల్లకల్లోలంగా ఉన్న ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న మన విద్యార్ధులను తీసుకోని రావడానికి కేంద్రం అన్నిచర్యలు తీసుకొన్నదని, అందరినీ సురక్షితంగా తీసుకొస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.
పాత్రికేయ సమావేశంలో భాజప ప్రకాశం జిల్లా అధ్యక్షులు సిరసనగండ్ల శ్రీనివాసరావు, ఉపాధ్షక్షులు పి.వి శివారెడ్డి, రమేష్ నాయుడు, రఘునాథ బాబు, అశోక్ యాదవ్, ఖలీఫాతుల్లాబాష, రమణయ్య, కిలారి రవి, ధనిశెట్టి రాము, పి. తిరుమల, అజయ్, సీతారామయ్య మరియు మహిళా నాయకురాండ్రు కోటేశ్వరి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.