గుంటూరు (ప్రజా అమరావతి);
హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు మేకతోటి సుచరిత గారిని నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసారు. బ్రాడీపేట లోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో హోం మినిస్టర్ సుచరిత గారిని కలిసి పుష్పగుచ్చేం ఇచ్చారు. నూతనంగా డీజీపీ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డి గారిని హోం మినిస్టర్ సుచరిత, భర్త ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ మేకతోటి దయాసాగర్ లు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ అంశాల గురించి హోంమంత్రి సుచరిత గారితో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి చర్చిండం జరిగింది.
*కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి - రాష్ట్ర డీజీపీ...*
డీజీపీ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హోంమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసాను.
పోలీసు శాఖ లో అవసరాలకు తగినట్టుగా బదిలీలు జరుగుతూ ఉంటాయి.
బదిలీలు, పోస్టింగ్ లు, ప్రమోషన్ లు ఇంటర్నల్ ఎక్సరైజ్ లో భాగమే.
పోలీసుల శాఖలో బదిలీలు రేగులర్ గా జరిగేవే. అవి యధావిధిగానే జరుగుతాయి.
త్వరలో జిల్లాల పర్యటన చేసి..అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను.