9వ జిల్లాస్థాయి రెవెన్యూ క్రీడా పోటీలు నాలుగవ రోజు ఆధ్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి.నెల్లూరు, మార్చి 19 (ప్రజా అమరావతి): 9వ జిల్లాస్థాయి రెవెన్యూ క్రీడా పోటీలు నాలుగవ రోజు ఆధ్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి.


నిత్యం పని ఒత్తిడితో ఉండే రెవెన్యూ ఉద్యోగులు వివిధ రకాల ఆటల పోటీల్లో తమ ప్రతిభను కనబరుస్తూ  సందడి చేస్తున్నారు. 


 శనివారం ఉదయం మొదలైన ఆటల పోటీల్లో జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

 తొలుత షటిల్ కోర్టులో కలెక్టర్, జెసి, డిఆర్ఓ, నెల్లూరు ఆర్డీవో షటిల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ షటిల్ ఆడిన తీరు పలువురిని ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ కూడా పోటాపోటీగా కాక్ ను అటు ఇటు మెరుపు వేగంతో కొట్టి ఆటగాళ్లలో మరింత క్రీడాస్ఫూర్తిని చాటారు. 

 అనంతరం బాస్కెట్బాల్, వాలీబాల్ క్రీడలను కలెక్టర్ కాసేపు పరిశీలించారు. ఆటగాళ్లను పరిచయం చేసుకుంటూ క్రీడల్లో బాగా రాణించాలని ఉత్తేజపరిచారు. జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ వాలీబాల్ పోటీలో అద్భుతంగా ఆడి చూపరులను ఆకట్టుకున్నారు. 

 డి ఆర్ ఓ, క్రీడల కన్వీనర్ శ్రీ చిన్న ఓబులేసు, నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, నాయుడుపేట, కావలి ఆర్డీవోలు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీ మురళీకృష్ణ, కుమారి చైత్ర వర్షిని, శ్రీమతి సరోజిని, శ్రీ సీనా నాయక్ వివిధ రకాల క్రీడలను పరిశీలిస్తూ, స్వయంగా ఆడి వారి డివిజన్ల క్రీడాకారులను ఉత్తేజపరిచారు. 


విజేతల వివరాలు

....................... 

- టెన్నికాయిట్ పురుషుల సింగిల్స్ విభాగంలో నెల్లూరు డివిజన్ కు చెందిన వై నాగరాజు మొదటి స్థానం, ఆత్మకూరు డివిజన్ నుంచి ఈ నాయబ్ రసూల్ ద్వితీయ స్థానంలో నిలిచారు.


- టెన్నికాయిట్ పురుషుల డబుల్స్ విభాగంలో నెల్లూరు డివిజన్ కు చెందిన వై నాగరాజు, జి మణికుమార్ మొదటి స్థానం, ఆత్మకూరు డివిజన్ కు  నాయబ్ రసూల్, డి సాయి కిరణ్ రెండో స్థానంలో నిలిచాయి.


- టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో నాయుడుపేట డివిజన్ నుంచి డీఎస్సీ స్వరూప్ మొదటి స్థానం, గూడూరు డివిజన్ నుంచి సిహెచ్ బాలచంద్రారెడ్డి రెండో స్థానంలో నిలిచారు.


- టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో నాయుడుపేట కు చెందిన డిఎస్ స్వరూప్, ఏ హరిబాబు మొదటి స్థానం, నెల్లూరు కలెక్టరేట్ కు చెందిన ఎన్ వి సుధాకర్, కే సురేంద్ర రెండో స్థానంలో నిలిచారు.


- వాలీబాల్ పురుషుల విభాగంలో ఆత్మకూరు డివిజన్ మొదటి స్థానం, కావలి డివిజన్ రెండో స్థానంలో విజేతలుగా నిలిచాయి.