*_కొండెక్కిన కోడి!_*
*_చికెన్ రేటు పైపైకి_*
*_నెలలోనే ధర రెట్టింపు_*
*_మార్కెట్లో కిలో 280కి చేరిక_*
*_కిలో రూ.280కి చేరిన చికెన్_*
అమరావతి (ప్రజా అమరావతి);
_బాయిలర్ కోడి కొండెక్కింది. చికెన్ రేటు చుక్కల్లోకి చేరింది. గతనెలతో పోల్చితే ఇప్పుడు ధర ఏకంగా రెట్టింపయింది. ప్రస్తుతం చికెన్ కిలో రూ.280 వరకూ అమ్ముతున్నారు. దాదాపు 4 నెలలుగా కోడిగుడ్డు ధరలు నిలకడగా ఉండగా, చికెన్ రేటు కిలో రూ.140- రూ.180 మధ్యే ఉంది. కానీ ఇప్పుడు బాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధర పెరుగుతోంది. రెండు నెలల క్రితం బాయిలర్ కోళ్ల ఫామ్‌గేట్ రేటు కిలో రూ.100లోపే ఉంది. అయితే 10 రోజులుగా ఈ ధర పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఫామ్‌గేటులో కోడి ధర కిలో రూ.140-150 మధ్య పలుకుతోంది. చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది ఇదే సమయానికి కిలో చికెన్ రూ.200 ఉన్నా ఇప్పుడున్నంత రేటు గత రెండేళ్లలో పలకలేదు._
*_కోడి పిల్ల రూ.50_*
_గతంలో కోడిపిల్ల రేటు రూ.10 ఉండగా, ఇప్పుడు రూ.50కి చేరింది. పెరిగిన దాణా ధరలతో గుడ్డు ఉత్పత్తి వ్యయం రూ.4.25 పడితే, గుడ్డు ధర రూ.3.65 మాత్రమే ఉండటంతో పౌలీ్ట్ర రైతులు_ _నష్టపోతున్నారు. రాష్ట్రంలోని పౌలీ్ట్రల్లో గత రెండునెలల్లో దాదాపు 60 లక్షల కోళ్లను తగ్గించేయడంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రోజుకు 4.22 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాని అంచనా. ఇందులో_ _సగానికిపైగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. మరోవైపు కోళ్లకు వేసే దాణా తయారీ ఖర్చులూ విపరీతంగా పెరిగాయి. గత 2నెలల్లో మొక్కజొన్న క్వింటాలు రూ.1,800 నుంచి రూ.2,300కు, సోయాబీన్ కేక్ కిలో రూ 35నుంచి రూ.70కి చేరాయి. టన్ను దాణా రూ.18వేల నుంచి రూ.28వేలు_ _అవుతోందని చెబుతున్నారు. ఈ భారం భరించలేక పౌల్ర్టీల నిర్వాహకులు కోళ్ల సంఖ్యను, కోడిపిల్లల_
_తయారీని తగ్గిస్తుండటంతో ఉత్పత్తి తగ్గి చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. కొవిడ్ సమయంలో ఉన్నంత వినియోగం ప్రస్తుతం లేకపోవడంతో గుడ్డు ధర నిలకడగానే ఉంటోంది. పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు విద్యుత్ చార్జీల పెంపు కూడా పౌల్ర్టీ నిర్వాహకులకు భారమైంది. ఎండలు ముదిరితే పౌల్ర్టీలు పూర్తిగా ఖాళీ అయి, గుడ్డు ధర కూడా పెరిగే అవకాశం ఉంది._
addComments
Post a Comment