తాడేపల్లి (ప్రజా అమరావతి); కె.ఎల్.విశ్వవిద్యాలయంలో ఈసీఎం విభాగం ఆధ్వర్యంలో తృసంగ్-2022 పేరిట రెండు రోజుల జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంద్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ లావణ్య చిమాట హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యార్థులో సృజనాత్మకత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు
. తాను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావడం వల్ల భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా సాధించిన తాజా సాంకేతిక పురోగతిపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు.విద్యార్థుల నుండి ఉత్తమమైన ఆవిష్కరణలు తీసుకురావడంలో విశ్వవిద్యాలయ యాజమాన్యం కృషి చేస్తోందని తెలిపారు.విద్యార్థులను యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆన్నారు. విద్యార్థులు స్టార్ట్ -ఆప్ తయారు చేయడానికి కావాల్సిన సహకారం తమ సొసైటీ అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు.యువత నూతన ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలని సూచించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయం లోనే కాకుండా పరిశ్రమలకు వెళ్తే అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవచ్చని ఆమె చెప్పారు ఈ టెక్నికల్ ఫెస్ట్ లో దేశం నలుమూలల నుంచి విద్యార్థులు హాజరయ్యారని ప్రోగ్రామ్ చైర్మన్ , ఈసీఎం విభాగాధిపతి డాక్టర్ శివ గంగ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వైవిఎస్ఎస్ఎస్వి.ప్రసాద్ రావు, స్కిల్ డెవలప్మెంట్ ఇన్ డాక్టర్ శ్రీనాథ్, ఆర్ అండ్ డి డీన్ డాక్టర్ జయ కుమార్ సింగ్, ప్లేస్మెంట్స్ డీన్ డాక్టర్ ఎన్.బి.వి ప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు,ఈసీఈ విభగదీపతి డాక్టర్ సుమన్, ప్రోగ్రామ్ కన్వీనర్ గోపీ కృష్ణా అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment