విజయవాడ (ప్రజా అమరావతి);
*అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం శ్రీ వైఎస్ జగన్*.
*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, పలువురు మహిళలు ఏమన్నారంటే*...
*పాముల పుప్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం*
ఈ రోజు మహిళల గురించి అందరూ గొప్పగా చెబుతారు, మహిళల సక్సెస్ గురించి మాట్లాడతారు. ప్రతీ రోజు మహిళలదే, ప్రతి రంగం మహిళలకే, అన్నింటా మహిళలే, అందరికీ ఆదర్శం ఏపీ మహిళలు అన్న విధంగా తీర్చిదిద్దిన ఘనత మన అన్న జగనన్నది. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందంటారు కానీ ఏపీలో ప్రతి మహిళ విజయం వెనుక అన్న ఉన్నాడు జగనన్న
ఉన్నాడని గర్వంగా చెప్పగలం. దేశంలో ఏ రాష్ట్రంలో మహిళలకు దక్కని గౌరవం ఏపీలో దక్కింది. ముఖ్యమంత్రి గారి మనసులో మహిళలకు ఉన్న స్ధానం గౌరవం ఏంటో తెలుసు. ఈ రోజు రాష్ట్రంలో ఒక దళిత మహిళ హోంమంత్రిగా, గిరిజన మహిళ అయిన నేను ఉప ముఖ్యమంత్రిగా, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా వనిత గారున్నారు. ఒక మైనార్టీ మహిళ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అయ్యారు, ఒక మహిళ సీఎస్‌గా పనిచేసి ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారంటే, సగం కార్పొరేషన్లు, సగం మున్సిపాలిటీలు, సగం పంచాయితీలు మహిళలే పాలిస్తున్నారంటే అది జగన్‌గారి వల్లే అని తెలియజేస్తున్నాను.
2014 ఎన్నికల్లో నేను పోటీ చేసేటప్పుడు నా నియోజకవర్గంలో నాకు ఓట్లేసే ప్రజలకు కూడా నా మొహం తెలీదు కానీ ఈ రోజు నాకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాష్ట్రస్ధాయిలో గుర్తింపు ఇచ్చిన ఘనత శ్రీ జగన్ గారిది, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. వంటింట్లో పరిమితమైన మేం ఇంత గౌరవం, గుర్తింపు, స్వేచ్చగా, ధైర్యంగా ముందుకెళుతున్నామంటే అది శ్రీ వైఎస్ జగన్ గారి వల్లే. ఆ రోజు 3648 కిలోమీటర్లు నడిచిన నడక మీదైతే ఫలితం మా అందరిది. ఆ రోజు పాదయాత్ర చేసిన కష్టం మీదైతే ఈ రోజు సంతోషం మా అందరిది. మేమంతా ఈ రోజు ఇంత సంతోషంగా, గౌరవంగా ఉన్నామంటే అది జగనన్న ఆశీస్సులే. ప్రతీ మహిళకూ నాదొక పిలుపు, జగనన్నకు మనం ఎప్పటికీ తోడుగా నిలిచి కుట్రలు, కుతంత్రాల నుంచి కాపాడే రక్షణ కవచంలా నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
*తానేటి వనిత, స్త్రీ,శిశుసంక్షేమ శాఖ మంత్రి*
ఈ రోజు ఈ మహిళా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి, కానీ ఇక్కడ జరుగుతున్న వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది, రెండున్నరేళ్ళుగా జగనన్న మనకు చక్కటి పాలన అందించారు. ఆయన మహిళా పక్షపాతిగా మనందరి అభివృద్ది, సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం, మనమంతా మహిళా సాధికారత సాధించే దిశగా అండగా ఉంటున్న నేపధ్యంలో మన సంబరాలు అన్నీ కూడా అంబరాన్ని అంటాయి. ఈ రోజున దేశాన్ని పాలించే ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్న ధీర వనితలు, వాణిజ్యరంగంలో వెలుగొందుతున్న అతివలు, క్రీడారంగంలో కాంతులీనుతున్న క్రీడామణులు, సామాన్య కుటుంబాలను నడిపిస్తున్న అమ్మలు, ఈ రోజున వేదిక మీదున్న మహిళా మణులు, ముందున్న ప్రతీ ఒక్క మహిళకు, స్త్రీ మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఎవరినోట విన్నా జగనన్నా అనే పదం వింటూనే ఉంటాం. అన్న అంటే అమ్మలో సగం, నాన్నలో సగం. అన్నకు నిలువెత్తు రూపం మన జగనన్న. అమ్మగా, నాన్నగా, మేనమామగా తనే బాధ్యత తీసుకుని మన బిడ్డల అవసరాలు తీరుస్తున్నారు. మహిళా సాధికారత అంటే మన నిర్ణయాలు మనమే తీసుకునే స్ధాయికి ఎదగడం, అలా తీసుకోవాలంటే ముందు విద్య, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఫైనాన్సియల్ స్ట్రెంగ్త్ ఈ మూడూ ఉండాలి. డ్వాక్రా మహిళలకు ఆర్ధిక భరోసా ఉండదు కానీ వారికి కూడా అండగా ఉండి మన సీఎంగారు చేయూత పథకం ద్వారా వారిని లక్షాధికారులుగా చూడాలని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కలను నిజం చేస్తున్నారు. జగనన్న వల్లే మహిళా సాధికారత సాధ్యమైందని చెప్పగానికి గర్వంగా ఉంది. మహిళల ఆత్మాభిమానం కాపాడేందుకు సొంతింటి కలను నెరవేరుస్తూ 32 లక్షల ఇళ్ళ స్ధలాలు ఇచ్చి, ఇల్లు కట్టిస్తున్నారు. దిశ చట్టంతో ఆడబిడ్డల భద్రతను తీసుకొచ్చారు. పేదలకు చక్కటి పౌష్టికాహారం అందించేలా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా అంగన్వాడీల ద్వారా అందించడం జరిగింది. చంద్రబాబు మహిళలను మోసం చేశారు, వారికిచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. ఇలాంటి చంద్రబాబు మాకొద్దు జగనన్న కావాలంటూ సీఎంని చేసిన మహిళందరికీ పాదాభివందనం. క్యాబినెట్లో ముగ్గురు మహిళా మంత్రులు, ఒకరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఒకరు హోంమంత్రి, నన్ను మహిళా శాఖ మంత్రిగా చేసి మహిళాసాధికారత మన క్యాబినెట్లో ఉందని నిరూపించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అవకాశం కల్పించారు. అట్టడుగు వర్గాలకు కూడా పదవులు ఇచ్చారు మన జగనన్న. మనమంతా కూడా రాబోయే రోజుల్లో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుని రాబోయే తరాలకు అందించాల్సిన భాద్యత మనపై ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
*ఆర్.కే.రోజా, ఎమ్మెల్యే*
ఈ నారీభేరి సౌండ్ నారావారి కర్ణభేరిలో రీసౌండ్ రావాలి. అందరికీ నమస్కారం. ప్రతీ మహిళా కూడా తలెత్తుకు చూడాలి. ప్రతి మహిళ ఇంత సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణం జగనన్నే. జగన్ గారు లాంటి మహిళా పక్షపాతి దేశంలో మరెక్కడా చూసి ఉండరు. ప్రతి మహిళ తలెత్తుకుని ఆత్మగౌరవంతో జీవించవచ్చని నమ్మకాన్నిస్తున్నారు. మహిళా సాధికారతకు, ఆత్మగౌరవానికి ఒక ఫ్రేమ్ కడితే ఎలా ఉంటుందో ఈ స్టేజిని ఒక ఫ్రేమ్ కడితే కనిపిస్తుంది. దటీజ్ జగనన్న. నేను 20 ఏళ్ళకు పైగా రాజకీయాల్లో అనేక వేదికలపై మహిళా సమస్యలపై మాట్లాడాను, కానీ నా జీవితంలో ఏ రోజూ కలగని ఆనందం ఈ రోజు ఈ వేదికపై కనిపిస్తుంది. మనతో ఏ సంబంధం లేకపోయినా తన కుటుంబ సభ్యుడిలా మనల్ని భావించి మనకు అవకాశం ఇస్తున్నారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, వారికి సాధ్యం కాని మహిళా సాధికారతను అక్షరాలా ఆచరణలో పెట్టిన జగనన్న మనతో ఉన్నారు. మహిళల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చేది, కానీ ఏ ఒక్కరూ అడగకుండానే, ఏ ప్రతిపక్షం ఊహించని విధంగా మహిళలకు జగనన్న పట్టం కడుతున్నారు. ఈ రెండున్నరేళ్ళలో దాదాపు రూ. 80 వేల కోట్లు వివిధ పథకాల రూపంలో మహిళలకు ఇచ్చిన మకుటుంలేని మహిళా సంక్షేమ మహా చక్రవర్తి మన జగనన్న. దేశంలో మిగిలిన రాష్ట్రాల సీఎంలు ఎవరూ ఇలా చేసి ఉండరు, నేను గర్వంగా భావిస్తున్నాను. ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా ఇది మహిళలకు ఎంత ఉపయోగపడుతుందని ఆలోచించే వ్యక్తి మన జగనన్న.
ప్రతిపక్ష టీడీపీ జగన్ గారి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు, లోకేష్‌కు, టీడీపీ నాయకులకు మహిళల గురించి, జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా. మీరు ఏం చేశారని మా జగనన్న గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ అంటే తెలుగు దుశ్శాసనుల పార్టీ. టీడీపీ నేతలు మహిళల గురించి ఎంత దారుణంగా మాట్లాడారో మనకు తెలుసు. అచ్చెన్నాయుడు అనగానే ఒక మాట గుర్తుకొచ్చింది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 160 సీట్లు వస్తాయంటున్నారు, ఇదే అచ్చెన్నాయుడు తిరుపతి ఎంపీ ఎన్నికలు అవగానే టీడీపీ లేదు, తొక్కాలేదు గట్టి చెట్నీ వేయి అని టిఫిన్ తిన్నారు. అయ్యా అచ్చెన్నాయుడు గారు నువ్వు గట్టి చెట్నీ గట్టిగా తింటే 160 కిలోలు పెరుగుతావు కానీ చంద్రబాబు కానీ నువ్వు కానీ తలకిందులు తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా ఇప్పుడున్న 23 కూడా రావు. నీకు మరి అంత సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు రా, ప్రతీ పోలింగ్ బూత్‌లో మహిళలు సత్తా చూపుతారు.
ఎవడు పడితే వాడు వచ్చి ఓడిస్తాను ఓడిస్తాను అంటే ఊరుకోడానికి ఇది మీ అడ్డా కాదు బిడ్డా... ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ, ఇది జగనన్న అడ్డా. చూశారు కదా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ లోకల్ బాడీ ఎలక్షన్ ఏది జరిగినా వార్ వన్‌సైడ్. ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న. ఏదో మీడియాను మేనేజ్ చేసేశాం, తోక పార్టీలను కలిపేసుకున్నాం, ఐదేళ్ళు మనం చేసిన పాపాలను జనం మర్చిపోయారని గెలిచిపోదామని గుంపులు గుంపులుగా గుంట నక్కలు, గుండెలు తీసిన బంట్లు ప్లాన్లు వేసుకుంటున్నారు, ఎవరేం చేసినా ఎంతమంది వచ్చినా జగనన్న సింహంలా సింగిల్‌గా వచ్చి సింగిల్ హ్యండ్‌తో వారినంతా మట్టి కరిపిస్తారు. జగనన్న ఒక వ్యక్తి కాదు ఆయన వెనుక ఐదు కోట్ల మంది ప్రజల శక్తి ఉంది, ముఖ్యంగా రెండున్నర కోట్ల మహిళా శక్తి ఉంది. మహిళా శక్తి అంతా జగనన్న వెంట ఉన్నంత వరకూ ఏ పార్టీ కూడా జగనన్న కాలి చిటికన వేలి మీదున్న వెంట్రుక కూడా పీకలేరు.
అసలు చంద్రబాబునాయుడు ఎక్కడ, జగనన్న ఎక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్. మహిళల జీవితాలు నాశనం చేసిన కాలకేయుడు చంద్రబాబు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన కారణజన్ముడు మన జగనన్న. చంద్రబాబు చీటర్, జగనన్న లీడర్, చంద్రబాబు మోసగాడు, జగనన్న మొనగాడు బోత్ ఆర్ నాట్ సేమ్. మ్యానిఫెస్టోని ఇంటర్నెట్లో తీసేసిన చంద్రబాబు ఎక్కడ, తను ఇచ్చిన ప్రతీ వాగ్ధానాన్ని నెరవేర్చిన జగన్ గారు ఎక్కడ, ఐదేళ్ళలో చంద్రబాబు సెంటు భూమి కూడా ఇవ్వలేదు కానీ జగనన్న 32 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలిచ్చి వారికి ఆస్తిని క్రియేట్ చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి పంగనామాలు పెట్టిన చంద్రబాబు ఎక్కడ, మన జగనన్న ఎక్కడ...ఆడపిల్లల ఫీజ్ రీఇంబర్స్మెంట్లో కోతలు పెట్టింది చంద్రబాబు. అసెంబ్లీ నుంచి నన్ను ఏడాది పాటు కక్ష్యకట్టి సస్పెండ్ చేశారు చంద్రబాబు హయాంలో. కాల్‌మనీ సెక్స్ రాకెట్ నడిపిన చంద్రబాబు ఎక్కడ, మహిళల కోసం దిశ చట్టం తీసుకొచ్చిన జగనన్న ఎక్కడ. చంద్రబాబుకు జగనన్నకు తేడా చెప్పాలంటే నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా. ఈ మహిళా దినోత్సవం రోజు ప్రతీ మహిళా తల ఎత్తుకోండి, చేతులు బిగించండి. మనకు అండగా ఉన్న జగనన్న ఇంకా 30,40 సంవత్సరాలు సీఎంగా ఉండి మనల్ని మన బిడ్డల భవిష్యత్‌ను, మన రాష్ట్ర భవిష్యత్‌ను అభివృద్ది వైపు పరుగులు పెట్టించాలని కోరుకుంటూ నినాదాలు చేయండి.
*వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ ఛైర్పర్సన్*
గతంలో చంద్రబాబునాయుడు పాలన చూశాం, ఇప్పటి పాలనలో ఆప్యాయంగా పలకరించే సీఎంను చూస్తున్నాం. ఒకప్పుడు పదవులు, పథకాలు అంటే చిల్లర నాణాలు విసిరినట్లు ఉండేవి కానీ ఈ రోజు నోట్ల ప్రవాహంలో, కృష్ణా, గోదావరి నదుల ప్రవాహంలా మహిళలు ఎక్కడ చూసినా ప్రవహిస్తున్నారు. ఇది కొంతమందికి నచ్చట్లేదు, పచ్చ రంగులు వేసుకుని, పిచ్చి గడ్డాలు వేసుకుని బయలుదేరుతున్నారు. ఆడవారికి అధికారం ఇవ్వడం ఇష్టంలేని వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధికారం ఇవ్వడం ఇష్టంలేని వారు ప్రతిపక్షాల పేరుతో రాజకీయం చేయాలని మనముందుకు వస్తున్నారు. మనమేం చేయాలి, మనకు ఈ స్ధానం ఇచ్చినందుకు నీచమైన కుట్రలు చేస్తున్న వారికి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది. కందుకూరి వీరేశలింగం, రాజారామ్మోహన్ రాయ్, బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా పూలే గారిని మర్చిపోని మనం ఈ రోజున దేశంలోనే లేని విధంగా 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన మన జగన్‌గారిని మరిచిపోతామా, కలలో కూడా జరగదు. మహిళా దినోత్సవాన్ని చాలామంది ఒకరోజు చేస్తారు కానీ ఇక్కడ రెండున్నరేళ్ళుగా ప్రతీ రోజూ మహిళా దినోత్సవమే. ఏ పధకమైనా ఏ నిర్ణయమైనా మన అక్కచెల్లెమ్మలు అనే ఆరాటపడే సీఎంగారిపై చేస్తున్న కుట్రలు మన మీద జరుగుతున్నవి, మాట్లాడే మాటలు మనపై మాట్లాడే మాటలు. ఇప్పుడు మనం ఒక్కో ఝాన్సీ లక్ష్మిలా, ఒక్కో వీరనారిలా మన ఊళ్ళలో నిలబడాల్సిన అవసరం ఉంది. మహిళలు సమానత్వం సాధించడానికి కేవలం రెండున్నరేళ్ళు పట్టింది. ఇంకో రెండున్నరేళ్ళలో ప్రపంచం గుర్తించే రీతిలో మా మహిళలు ఉంటారు. ఈ మహిళా దినోత్సవాన్ని సీఎం దంపతులకు అంకితం చేస్తున్నాం. మహిళా కమిషన్ ఈ సాధికారతను నిలబెట్టాలని నిరంతరం తాపత్రయ పడుతుంది. మేం మహిళా పార్లమెంట్ నిర్వహించి దిశ బిల్లును కూడా ఆమోదించేశాం. జగన్ గారు పడుతున్న తపనకు అండగా నిలబడాలని మహిళా కమిషన్ కోరుకుంటుంది. ఈ ఏడాదంతా సబల, ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాంలో భాగంగా ఐదు ప్రధాన సమస్యలు తీసుకున్నాం. సీఎంగారి అండతో మా మహిళా కమిషన్ మహిళలకు మరింత తోడుగా నిలుస్తుంది. ధ్యాంక్యూ.
*మహ్మద్ సుల్తానాబేగం, యనమలకుదురు, పెనమలూరు మండలం*
జగనన్నా నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను. నాకు ఆర్ధిక సమస్యల కారణంగా ఒక కంపెనీలో పని చేసేందుకు వెళితే మిషన్‌లో పడి కుడి చేయి కట్ అయింది. అప్పటి నుంచి ఒక్క చేత్తో పని చేయడం సాధ్యం కాదని చాలామంది చెప్పారు, నేను దాంతో ఎడమచేత్తో వ్రాతను నేర్చుకుని కంప్యూటర్ నేర్చుకుని ఎంబీయే పూర్తిచేశాను. నా వైవాహిక జీవితంలో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నాను. నేను గర్భవతిగా ఉన్న సమయంలో మీరు సీఎం అయ్యారు. నాకు గతంలో రూ. 500 పెన్షన్ వచ్చేవి, కానీ ఇప్పుడు నెలకు రూ. 3 వేలు పెన్షన్ వస్తుంది. నా బిడ్డకు అమ్మ ఒడి కూడా వచ్చింది. నేను ఫ్యాన్సీ షాప్ కూడా బ్యాంకు రుణం తీసుకుని ప్రారంభించాను. నాకు ఆసరా ద్వారా వచ్చిన డబ్బుతో చీరల వ్యాపారం చేస్తున్నాను. మా అమ్మకు చేయూత ద్వారా వచ్చిన డబ్బుతో కిరాణా షాప్ కూడా పెట్టి రిలయెన్స్ ఆజియో అనుసంధానంతో మేం తక్కవ ధరకే సరుకులు తీసుకుని ఎక్కువ ఆదాయం పొందుతున్నాం. మీరిచ్చిన ప్రతీ రూపాయి కూడా నా జీవనోపాధికి ఉపయోగించుకుని రోజుకు రూ. 700 నుంచి రూ. 1000 ఆదాయం పొందుతున్నాను. మీరు ఇస్తున్న ప్రతీ రూపాయి సద్వినియోగం చేసుకుంటున్నాం. నా ధైర్యం, నా నమ్మకం, నా చేయూత నువ్వే జగనన్నా. మహిళా దినోత్సవం ఈ రోజు కాదు...జగనన్న సీఎం అయినప్పటి నుంచి ప్రతీ రోజూ మహిళా దినోత్సవమే ప్రతీ రోజూ పండుగే...
*కర్ల రాణి, జమ్మవరం బోడవాడ గ్రామం, వీరులపాడు మండలం*
అన్నా మేం కూలీ పనులు చేసుకుని బతకలేక కుటుంబాన్ని పోషించలేక ప్రతీ రోజూ ఏడ్చేవాళ్ళం. మాకు ఇద్దరు ఆడపిల్లలు, వారిని ఎలా చదివించాలి, ఎలా పెళ్ళి చేయాలనుకునేవాళ్ళం. నా భర్తకు లారీ ప్రమాదంలో కాళ్ళు విరిగి ఇక నడవలేడని డాక్టర్ చెప్పేసరికి నేను చనిపోవాలనుకున్నా. నా కూతురు బీటెక్ చదవాలని ఉందంటే నేను చదివించలేనన్నా. కానీ నా కూతురు అమ్మా నాకు జగన్ మామయ్య ఉన్నారన్న ధైర్యంతో మైలవరంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. నాకు వైఎస్ఆర్ ఆసరా అందింది, ఆ డబ్బుతో మేకలు కొంటే వాటి విలువ ఇప్పుడు రూ. 75 వేలు. రెండో విడతలో వచ్చిన డబ్బుతో పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటున్నా. నేను ఇంటి పట్టా పొందాను. నా అక్క కూడా లబ్ధిపొందింది, నా తండ్రిగారికి నాడు నాన్న గారు వైఎస్ఆర్ గారు ప్రాణం పోస్తే మీరు వచ్చిన తర్వాత పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. మా ఒక్క కుటుంబమే ఏడాదికి రూ. 5.23 లక్షలు లబ్ధిపొందాను, మా కుటుంబమంతా రూ. 7 లక్షల లబ్ధిపొందాం. మీరు వచ్చినప్పటి నుంచి మాకు ప్రతి రోజూ మహిళా దినోత్సవమే. ఇంతటి గొప్పవ్యక్తికి జన్మనిచ్చిన మీ తల్లిగారైన మా విజయమ్మకు మహిళా లోకమంతా శిరస్సు వంచి నమస్కరిస్తుంది. ధన్యవాదాలు అన్నా.
addComments
Post a Comment