గౌ.భారత ఉప రాష్ట్రపతికి స్వాగత, వీడ్కోలు
తిరుపతి/రేణిగుంట, ఏప్రిల్ 29 (ప్రజా అమరావతి): నాగ్పూర్ పర్యటన నిమిత్తం వెంకటాచలం నుండి ప్రత్యేక రైలు లో రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకున్న గౌ. భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారికి ఘనస్వాగతం లభించింది. డిప్యూటీ సిఎం నారాయణస్వామి, జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, డి ఆర్ ఎం వెంకట రమణా రెడ్డి, జే సి బాలాజీ, నగరపాలక సంస్థ అనుపమ అంజలి, ఎస్ పి పరమేశ్వర రెడ్డి, ఏ డి ఆర్ ఎం సూర్య నారాయణ, తిరుపతి స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, రేణిగుంట స్టేషన్ మేనేజర్ శ్రీధర్, టిఐ జైనేందర్, స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం గౌ. ఉప రాష్ట్రపతి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయం చేరుకొని నాగ్పూర్ పర్యటనకు బయలుదేరారు. విమానాశ్రయంలో డిప్యూటీ సిఎం నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, జే సి బాలాజీ, నగరపాలక సంస్థ అనుపమ అంజలి, ఎస్ పి పరమేశ్వర రెడ్డి వీడ్కోలు తెలిపారు. శ్రీకాళహస్తి ఆర్ డి ఓ హరిత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, తహశీల్దార్ లు ఉదయ సంతోష్, షేక్ జరీనా, రెవిన్యూ, పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.