***ఈ నెల 29న ఇఫ్తార్ విందు***
* నూర్ ఏ జహాన్ ఫంక్షన్ హాలులో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు*
***రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష**
కడప, ఏప్రిల్ 28 (ప్రజా అమరావతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరుగుతోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు. గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల ఏప్రిల్ 29 న కడప జిల్లాకు సంబంధించిన ఇఫ్తార్ విందును మద్రాస్ రోడ్డు నందు గల నూర్ ఏ జహాన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశామన్నారు.
ఏప్రిల్ 29 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లింసోదరుల తో పాటు,కుల మతాలకు అతీతంగా జిల్లాలోని ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. అక్కడే నమాజు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.నమాజు తర్వాత హాజరైన వారందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర స్థాయిలో విజయవాడ నగరంలో జరిగిన ఇఫ్తార్ విందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారని తెలిపారు.ఈ ఇఫ్తార్ విందులో సుమారుగా పదివేల మంది ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.