నగరంలో వెల్లివిరుస్తున్న మతసామరస్యం

 


**నగరంలో వెల్లివిరుస్తున్న మతసామరస్యం


**


**నగరంలో మోడల్ స్మశాన వాటిక**


*హిందు, ముస్లిం,క్రైస్తవ సోదరులకు  స్మశాన వాటిక*


**స్మశాన వాటిక పనుల పురోగతిని పరిశీలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష** 


కడప, మే 8 (ప్రజా అమరావతి):  నగరంలోని పట్టణ శివారులో  హిందు, ముస్లిం,క్రైస్తవ సోదరుల కోసం నిర్మిస్తున్న స్మశాన వాటిక పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అధికారులను ఆదేశించారు. 


ఆదివారం నగరంలోని రామాంజనేయపురం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న స్మశాన వాటికల నిర్మాణ  పనుల పురోగతిని  నగర మేయర్ సురేష్ బాబు తో కలసి

సంబంధిత అధికారులతో  సమీక్షించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ...దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి  హయాంలో 10.50   ఎకరాల స్థలాన్ని   ముస్లిం హిందూ క్రైస్తవ మతాలకు చెందిన వారికి స్మశాన వాటికకు కేటాయించడం జరిగిందన్నారు.అందులో భాగంగా రూ 3.50 కోట్ల రూపాయలతో స్మశాన వాటికను  అభివృద్ధి చేయడం  జరిగిందన్నారు. ముస్లిం,హిందు క్రైస్తవ సోదరుల కోసం ప్రత్యేకమైన రూములను,   నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అలాగే ముస్లిం  సోదరులు కోసం ప్రార్థనా గదిని,హిందు సోదరుల కోసం మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గ్యాస్ క్రేమోటోరియాని  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఇప్పటికే సుమారుగా 80 నుంచి 90 శాతం పనులు పూర్తి కావడం జరిగిందన్నారు.స్మశానవాటికలోమరిన్ని  మౌలిక వసతులు కల్పించుటకు మరో ఒక కోటి యాభై లక్షల రూపాయలు అవసరం అవుతుందని  అధికారులు చెప్పారన్నారు  ఖచ్చితంగా వాటిని కేటాయించి  రాబోయే రోజుల్లో   ప్రజలకు మోడల్ స్మశాన వాటికను  అందుబాటులోకి తీసుకురావాలని  అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. 


నగర జనాభ పెరిగిపోతున్న తరుణంలో స్మశానవాటికలు ఎదురవుతున్న ఇబ్బందులు  తరుణంలో  కడప అర్బనైజేషన్ లో భాగంగా   10:30 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన మూడు కమ్యూనిటీల  స్మశాన వాటికను  ఆయా కమిటీలకు సంబంధించిన  ఆర్గనైజేషన్స్ కు అప్పజెప్పి,వీటి పర్యవేక్షణ జరుపుతారన్నారు. ఇందులో వేచియుండు గది, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, స్మశాన వాటికకు ఇంటర్నల్ రోడ్లు ఏర్పాటు చేయాలని, అసంపూర్తి ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయాలని,చెట్లను పెంచాలని అంతేకాక స్మశానవాటికలో భూమి చదును చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.స్మశాన వాటిక, స్నానపుగదులు అందుకు కావాల్సిన నీటి వసతి తదితర మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 


అనంతరం నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. నగర  జనాభాను దృష్టిలో ఉంచుకొని ఆనాడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హిందూ ముస్లిం సోదర క్రైస్తవ సోదరులకు పదిన్నర ఎకరాల స్మశాన వాటిక కేటాయించడం జరిగిందన్నారు. గత  గత ప్రభుత్వ పాలకులు వీటిని పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడున్నర కోట్ల తో స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ, స్నానపు గదులు, క్రేమోటోరియాన్ రూములు, గ్రీనరీ ఏర్పాటుచేసి నగర ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని సందర్భంగా ఆయన తెలిపారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది, స్థానిక నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.