పెనుమంట్ర. మే.01 (ప్రజా అమరావతి);
రాష్ట్రాన్ని పర్యాటక హాబ్ గా తీర్చి దిద్ది , యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా కల్పింస్తాం
:రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు శాఖమంత్రి శ్రీమతి ఆర్.కె .రోజా ...
రాష్ట్రాన్ని పర్యాటక హాబ్ గా తీర్చి దిద్ది , యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాలు అభివృద్ధి పథంలో పయనించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అశయం అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు శాఖమంత్రి శ్రీమతి ఆర్.కె .రోజా అన్నారు. పెనుమంట్ర మండలం సోమరాజు యిలింద్రపర్రు గ్రామంలో రూ 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనం ను ప్రారంభోత్సవం చేశారు. రూ 20 లక్షలతో అంచనా తో నిర్మిచనున్న బీసీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. మల్లిపూడి గ్రామంలో రూ 17.50 లక్షలతో నిర్మించిన
వెల్నెస్ సెంటర్ ప్రారంబొత్సవం చేశారు. పెనుమంట్ర గ్రామంలో
జెడ్ పి హై స్కూల్ లో నాడు - నేడు కార్యక్రమంలో రూ 1కోటి 18 లక్షలు రూపాయల తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన , బ్రాహ్మణ చెరువు కాలువ నుండి పెనుమంట్ర మంచి నీటి చెరువుకు నేరుగా పైపు లైన్ ద్వారా నీరందించే 30 లక్షల రూపాయల లతో నిర్మించిన పంపు హౌస్ కు బ్రాహ్మణ చెరువు వంతెన వద్ద ఆచంట శాసన సభ్యులు శ్రీ చెరుకువాడ.శ్రీ రంగనాథ తో కలిసి మంత్రి ఆర్ కె రోజా పాల్గొన్నారు.
అంతకుముందు నూతన జిల్లాకు వచ్చిన మంత్రి శ్రీమతి ఆర్ కె రోజాకు బైక్ ర్యాలీ, కార్ ర్యాలీ బాణాసంచా కాల్పులు, అడుగడుగునా పూలవర్షం తో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో యం పి పి కర్రి. వాసు రెడ్డి ,జెడ్ పి టి సి సభ్యులు శ్రీమతి కర్రి. గౌరి సుభాషిణి , నాయకులు కర్రి. వేణు బాబు, వనుం. సూర్యనారాయణ, దొంగ.మహాలక్ష్మి,శ్రీమతి తాడిపర్తి.ప్రియాంక, వాసం శెట్టి. కిరణ్, అనిత, కొవ్వూరి.చిన్న , వివిధ శాఖలు అధికారులు,వివిధ గ్రామాలు ప్రతినిధులు , తది తరులు పాల్గొన్నారు.