భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకం.
డి ఆర్ ఓ గంగాధర్ గౌడ్
పుట్టపర్తి,మే,08 (ప్రజా అమరావతి):
*భగీరథ మహర్షి పట్టుదలతో దివినుండి భువికి లోక కల్యాణం కోసం గంగ ను తెచ్చిన మహానుభావుడని,ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా రెవిన్యూ శాఖ అధికారి గంగాధర్ గౌడ్ తెలిపారు ఆదివారం ఉదయం శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు బిసి కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ మాట్లాడుతూ భగీరథ మహర్షి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దివి నుండి భువికి గంగను లోక కల్యాణం కోసం తెచ్చిన మహానుభావుడన్నారు.ఆయన పట్టుదలకు మారు పేరని, అందుకే ఆయన అపర భగీరథుడుగా పేరొందారన్నారు. మరుగునపడిన చరిత్రకారుల జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి చున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పుడా చైర్మన్ జి. లక్ష్మి నరసమ్మ గారు, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నరసింహప్ప గారు, నల్లప్ప, కొల్లయ్య, సహాయ వె. త.సంక్షేమ అధికారులు, శ్రీ రాజ కుళ్ళయప్ప గారు, నాగేంద్ర రాజు గారు, గంగాద్రి గారు మరియు బి. సి.సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ శ్రీమతి హరిత గారు, తరులు పాల్గొన్నారు