*
25లక్షలు విలువ చేసే 26 ద్విచక్రవాహనాలతో పాటు ముగ్గురు నిందితులు అరెస్టు కేసునమోదు*
*అందులో ఒకరు మైనర్ బాలుడు ఉండడం గమనార్హం.*
*వివరాలు వెల్లడించిన మదనపల్లి DSP రవి మనోహరా చారి...*
అన్నమయ్య జిల్లా (ప్రజా అమరావతి): మదనపల్లి పట్టణంలోని ద్విచక్రవాహనాలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారించగా చెడు వ్యసనాలకు అలవాటు పడి, దొంగతనాలకు పాల్పడినట్లు విచారలో వెల్లడించి నట్లు మదనపల్లి D S Pరవి మనోహరా చారి తెలిపారు.వారిలో ఒకమైనర్ బాలుడు ఉన్నారని తెలిపారు. వీరిపై అన్నమయ్య జిల్లా, మదనపల్లి,పీలేరు,కలికిరి, ముదివేడు,పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని,ఇరవై ఐదు వాహనాల విలువ ఇరవై ఆరు లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులపై కేసునమోదు రిమాండ్ కు తరలించినట్లు రవి మనోహరా చారి తెలిపారు.ఈ కార్యక్రమంలో, Ci మురళీకృష్ణ, S I లు,పోలీసులు పాల్గొన్నారు.
addComments
Post a Comment