తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

  

తిరుమల,  జూన్ 09 (ప్రజా అమరావతి):      

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌         తిరుమల శ్రీవారిని గురువారం రాత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.        ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.


       శ్రీవారి దర్శనానంతరం శ్రీ వరాహస్వామివారిని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ దర్శించుకున్నారు.


          ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ హరీంద్రనాథ్, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.Comments