ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని శేషాచల అడవులను పరిరక్షించాలి : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యెన్ వి రమణ

 

ఎర్రచందనం అక్రమ రవాణా పై  సత్వర పరిష్కారం కొరకు రెండు ప్రత్యెక కోర్టులు ప్రారంభం సంతోష దాయకం: 


ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని శేషాచల అడవులను పరిరక్షించాలి : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యెన్ వి రమణ 
తిరుపతి, జూన్ 9 (ప్రజా అమరావతి): ఎర్రచందనం అక్రమ రవాణా పై  సత్వర పరిష్కారం కొరకు రెండు ప్రత్యెక కోర్టులు తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందనీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యెన్ వి రమణ అన్నారు. స్థానిక ఎస్ వి  యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యెన్ వి రమణ గారికి జరిగిన అభినందన సభలో వారు మాట్లాడుతూ తిరుపతికి రావడం ఆ వేంకటేశుని దర్శించుకోవడం కోసం ఏ అవకాసం వచ్చిన మహా భాగ్యంగా భావిస్తానని సుప్రీ౦ కోర్ట్ అఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ శ్రీ. నూతనపాటి వెంకట రమణ తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారించడం కోసం రెండు ప్రత్యేక న్యాయస్థానాలు ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందన్నారు. అత్యంత విలువైన ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవులలో మాత్రమే దొరుకుతుందని, మన  ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత విలువైనదని అసాధారణమైన రంగు , అత్యంత ఔషధ గుణాలు కలిగినందునే ఎర్రచందనంను ఎర్రబంగారంగా మార్చారని అన్నారు. అందువలనే ఈ ఎర్ర చందనం కి సంబంధించి  చాల సమస్యలు రావడం జరిగింది అని తెలిపారు. ఈ ఎర్రచందనం దాదాపు 5300 చ.కిమీ దూరం వరకు వేలసంఖ్యలో  ప్రకృతి సిద్ధంగా విస్తరించి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కోట్లు పలుకుతోందని అన్నారు. గత దశాబ్ద కాలంగా దీనిని స్మగ్లర్లు అక్రమ మార్గాల ద్వారా నరికి విదేశాలకు ఎగుమతి చేసే కార్యక్రమాన్ని ఒక వృత్తిలాగా చేపట్టి  అక్రమార్జనకు అలవాటు పడ్డారని అన్నారు. అంతే కాకుండా అటవీ పర్యావరణాన్ని మరియు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. ఈ మూడు దశాబ్దాలలో ఎర్రచందనం 30 నుండి 50 శాతం వృక్షాలను కొట్టివేయడం జరిగిందని అన్నారు. దురదృష్ట వశాత్తు చట్టంలోని బలహీనతలు సరైనటువంటి పటిష్టమైన న్యాయవ్యవస్థ లేకపోవడం, తక్కువ శిక్షలతో బయటపడతామనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో దీనివైపు ఆకర్షితులై ఈ అక్రమ రవాణా కు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే 1 సం జైలు శిక్ష 10 వేలు జరిమానా ఉండేది దీనితోటి స్మగ్గ్లింగ్ చేసే ముఠాలు పెద్ద సంఖ్యలో స్మగ్గ్లింగ్ కు పాల్పడే వారి కుటుంబాలకు అండగా నిలిచి వారిని పోషించి వారు శిక్ష నుండి బయటకు రాగానే యధావిధిగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించి ప్రభుత్వం అటవీ పర్యావరణ చట్టాన్ని సవరించి ఈ శిక్షలను 10 సం. వరకు, జరిమానా లక్ష రూపాయలు కు పెంచారు. ఐనప్పటికీ కూడా ఈ అక్రమ రవాణ ఆగడం లేదు. దురదృష్ట వశాత్తూ ఈ శిక్ష మొదటి సారి చేస్తే 5 సం. లు జరిమానా 3 లక్షలు రెండవ సారి చేస్తే 7 సం. జరిమానా 7 లక్షలని, తన దృష్టిలో ఇంకా కఠీనమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమె ఈ సంపదను మనం పరిరక్షించుకోగలం అన్నారు. అటవీ సంపదను హరించడం చాల తీవ్రమైన చర్య అనీ దీనిని అడ్డుకోవడం అందరి బాధ్యత అన్నారు.  ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. 2016 లో ఈ చట్టం వచ్చినప్పటికీ కూడా కోర్టులు ఏర్పాటు కాకపోవడం వలన కొత్త చట్టం కింద ఒక కేసు కూడా విచారణ జరగలేదు. ఈ రోజు మొదటి సారిగా ఎర్రచందనం అక్రమరవాణ విచారణకు ప్రత్యెక కోర్టులు ప్రారంభించడం జరిగిందని, త్వరలోనే ఈ కోర్టులు విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఇప్పటివరకు దాదాపు 2348 విచారణకు సంబంధించిన కేసులు విచారణ పెండింగులో ఉన్నాయనీ, కేసులు వేల సంఖ్యలో ఉన్నాయి కాబట్టి, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇలాంటి మరొక జిల్లా కోర్టులు ఏర్పాటు చేయమని, సిబ్బందిని, అధికారులను ఏర్పాటు చేయమని కోరుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ.50 లక్షలను కోర్టుల మౌలిక సదుపాయాల కోసం విడుదల చేసిందని, ఈ మొత్తాన్ని ఇంకా పెంచాలని, కోర్టుకు సంబందించిన అధికారులను నియమించాలని సూచించారు. తుడా కాంప్లెక్స్ లో తక్కువ ఆద్దేకే ఇచ్చి ఈ కోర్టుల ఏర్పాటు కి సహకరించిన చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి శాసన సభ్యులు కరుణాకర రెడ్డి గారికి తన ధన్యవాదాలు తెలిపారు. నేరం జరిగాక శిక్షల గురించి కాకుండా నేరం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే ముఖ్యమని, ఎర్ర చందనం చెట్లు నరికివేతకు గురికాకుండా ఎన్.జి.ఓ లు, ఇతర సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాలని అటవీ శాఖ సిబ్బందిని బలోపేతం చేసి, తిరుమల తిరుపతి వృక్ష సంపదను కాపాడాలని అన్నారు. ఈ అంశం పై విద్యార్థులు, ఉపాద్యాయులు, న్యాయ అధికారుల పాత్ర చాల ముఖ్యమని తెలిపారు. అడవిని కాపాడుతున్న అడవి బిడ్డలకు ఉద్యోగ కల్పన చేయాలనీ సూచించారు. బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు వాయిదాలు లేకుండా సహకరించి  త్వరిత గతిన కేసులు పరిష్కరింఛి న్యాయం జరిగేలా చూడాలన్నార. 


 ఈ సందర్భంగా ప్రత్యెక కోర్టుల ఏర్పాటుకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ హైకోర్టు అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ సత్యనారాయణ మూర్తి చిత్తూరు గారికి, , ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జ్ అసదుద్దీన్ అమానుల్లా గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. కొత్తగా ప్రారంభమైన ఎర్ర చందనం స్మగ్లింగ్ నివారణ ప్రత్యెక జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్.నాగరాజు గారికి, మేజిస్ట్రేట్ శ్రీనివాస్ గారికి సఫలీకృతులు కావాలని మనసస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.దినకర్ వారి సభ్యులకు, న్యాయవాదులు, న్యాయ మూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. తను సి.జే.ఐ గా నియామకం అయినప్పటి నుండి న్యాయమూర్తుల నియామకానికి కృషి చేస్తున్నానని 195 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి ప్రతిపాదనలు పంపిస్తే ఈ రోజు  వరకు 167 మంది హైకోర్టు జడ్జ్ లు నియమింపబడ్డారు. 11 సుప్రీమ్ కోర్టు జడ్జ్ లు నియమింపబడ్డారు. ఇంకా 180 దాకా జడ్జ్ ల  నియామకాల పెండింగ్ వాటిని ఆగస్ట్ లోగా నియమించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రాబోవు కాలంలో కోర్టులు సమర్తవంతంగా పని చేయాలని తెలిపారు. టెక్నాలజీని అలవరచుకోవాలని వర్చువల్ విధానంలో కేసులు సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి అన్నారు.   

 కార్యక్రమం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల ప్రత్యెక కోర్టులను సి.జే.ఐ గారి చేతుల మీదుగా ప్రారంబించడం ఎంతో సంతోషించదగ్గ తరుణమని రాష్ట్రంలోని ఎర్ర చందనం కేసులన్నింటికి విచారణ ఈ కోర్టుల ద్వారా  నిర్వహించి సత్వరమే తీర్పు వచ్చే విధంగా అవకాశం ఉంటుందని తెలిపారు. ఎర్ర చందనం అత్యంత విలువవైన అరుదైన సంపద అని వీటిని కాపాడుకోవలసిన భాద్యత ఉందని గుర్తు చేశారు.  ఈ సందర్భంగా గౌ .సి.జే.ఐ గారు  ఎర్ర చందనం కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరియొక ప్రత్యెక  జిల్లా కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని  సూచించిన సందర్భంలో తప్పకుండా సానుకూలమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశం అనంతరం గౌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారిని  ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ ఈ.భీమా రావు, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్.ప్రదీప్ కుమార్, హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ జనరల్ ఏ.వి రవీంద్ర బాబు, హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేటివ్ వెంకటరమణ, ఫ్యామిలీ కోర్ట్, అయిదవ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ తిరుపతి జి.అన్వర్ బాషా, తిరుపతి కోర్టు మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు న్యాయ ప్రాధికార సంస్థ చైర్మన్ వై వీర్రాజు, నాలుగవ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ తిరుపతి ఏ.సత్యానంద్, బార్ అసోసియేషన్ కమిటి మెంబర్ మరియు రెప్రజెంటేటివ్ ఆర్.పద్మజ, , జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఎస్.వి యునివర్సిటీ వైస్ చాన్సలర్ రాజ రెడ్డి, జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయ వాదులు తదితరులు పాల్గొన్నారు.

Comments