వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా – వరసగా మూడో ఏడాది


అమరావతి (ప్రజా అమరావతి);


*వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా – వరసగా మూడో ఏడాది*


*ఏరువాకతో సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతకు అండగా, 2021 ఖరీఫ్‌ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఈ ఖరీఫ్‌ ప్రారంభంలోనే రూ. 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని నేడు (14.06.2022) శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్ధిక భారం లేకుండా, రైతుల తరపున పూర్తి ప్రీమియం బాధ్యతను కూడా శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే తీసుకుని, సాగుచేసిన ప్రతి ఎకరాన్ని ఈ–క్రాప్‌లో మన గ్రామంలోనే ఆర్‌బీకేల ద్వారా నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తూ...బీమా పరిహారపు సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా ఒక సీజన్‌ది మరుసటి ఏడాది అదే సీజన్‌ రాకముందే క్రమం తప్పకుండా చెల్లిస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం*


*గతంలో బీమా క్లెయిమ్‌లు ఎప్పుడొస్తాయో, ఎంతొస్తాయో, ఎంతమందికొస్తాయో కూడా తెలియని అయోమయ పరిస్ధితి...మరి ఈ ప్రభుత్వంలో మాత్రం గత ఖరీఫ్‌ సీజన్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ సమయానికే చెల్లింపు. ఆర్‌బీకేల ద్వారా పంట వేసినప్పుడే ఈ–క్రాప్‌లో నమోదు చేసి రసీదు, ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదని మన గ్రామంలోనే సోషల్‌ ఆడిట్‌ కొరకు పేర్లు డిస్‌ప్లే...పొరపాటున ఎవరైనా మిస్‌ అయితే వారికి కూడా ఇవ్వాలన్న తపన, ఇంత వేగంగా బీమా పరిహారం చెల్లింపులు జరగడం దేశంలోనే మొదటిసారి*


*ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతన్నలకు...*


గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, అయిన వారికే పరిహారం, రైతన్నలు క్షేత్రస్ధాయి ఉద్యోగుల చుట్టూ తిరిగి ఏళ్ళ తరబడి ఎదురుచూసినా నష్టపరిహారం అందుతుందో లేదో తెలియని దుస్ధితి. అరకొరగా అందే ఆ హరిహారానికి కూడా మధ్యవర్తులు, దళారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్ధితి


ఈ ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారానే పంట వేసినప్పుడే ఈ–క్రాప్‌లో నమోదు చేయించి శాస్త్రీయంగా, అర్హులెవ్వరూ మిగిలిపోకుండా పంట నష్టాల అంచనా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శించి మరీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే పరిహారం నేరుగా వారి ఖాతాల్లో జమ


*రైతన్నలకు మంచి చేయాలనే ఆలోచన చేయడమే కాకుండా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం జరిగినా అది చీడ, పీడల వల్ల అయితేనేం...అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాల వల్ల అయితేనేం...ఇంకొకటి అయితేనేం...ప్రతి అడుగులో రైతన్నలకు అండదండలందిస్తూ తోడుగా నిలుస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం*


*గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా రైతన్నలకు శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నేటి వరకు చేకూర్చిన లబ్ధి రూ. 1,28,171 కోట్లు*


*పంటల బీమా చెల్లింపు వివరాలు*


*గత ప్రభుత్వం*


2014 – 15 లో 1.03 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 132.24 కోట్ల పరిహారం 

2015 –16 లో 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 339.70 కోట్ల పరిహారం

2016 – 17 లో 8.70 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 954.75 కోట్ల పరిహారం

2017 – 18 లో 6.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 720.60 కోట్ల పరిహారం

2018 – 19 లో 10.00 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1,263.91 కోట్ల పరిహారం ( ఈ ఏడాది పూర్తిగా చెల్లించలేదు)

మొత్తం 30.85 లక్షల మంది లబ్ధిదారులకు 3,411.20 కోట్ల పరిహారం


*శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం*


శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించిన గత ప్రభుత్వ బకాయిలు 6.19 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 715.84 కోట్ల పరిహారం

2019 – 20 లో 9.48 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1,252.18 కోట్ల పరిహారం

2020 – 21 లో 13.00 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1,739.00 కోట్ల పరిహారం

2021 – 22 లో 15.61 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2,977.82 కోట్ల పరిహారం.

మొత్తం 44.28 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 6,684.84 కోట్ల పరిహారం.

Comments