శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి): 


     ఈరోజు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు ఆలయము పరిసరములలోని శానిటేషన్ విభాగము పనులను పరిశీలించారు. భక్తులు సంచరించే ప్రదేశములలో(క్యూ-లైన్ లు, లిఫ్టులు, ప్రసాదం కౌంటరులు, డస్ట్ బిన్లు, తాగునీటి కుళాయిలు, టాయిలెట్లు మరియు ఇతర ప్రదేశములలో)   సమయానుసారముగా సంబంధిత శానిటేషన్ సిబ్బంది శానిటేషన్ చేస్తూ పరిశుభ్రత పాటించవల్సినదిగా సూచించారు. దేవస్థానం లోని అన్ని పరిసరములు శుభ్రత పై ఎప్పటికప్పుడు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్(శానిటేషన్ విభాగం కొరకు) ద్వారా  సమాచారం తెలుసుకొనుచూ, ప్రత్యేకంగా భక్తులు సంచరించే ప్రదేశములకు అధిక ప్రాధాన్యత ను ఇవ్వవలసినదిగా సంబంధిత విభాగపు అధికారులకు సూచనలిచ్చారు. 

 మరియు పలు ప్రదేశములలోని పరిశుభ్రతపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించెదమని తెలిపారు. అపరిశుభ్రత గమనించిన యెడల సంబంధిత ప్రదేశపు సూపర్వైజర్ మరియు ఇన్స్పెక్టర్లు తదుపరి చర్యలకు భాద్యలగుదురని తెలిపారు. 

    అలాగే ఆలయ పరిసరములు పరిశుభ్రముగా ఉంచుటలో సిబ్బంది ప్రతి  ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ వంతు బాధ్యతగా వారి విధినిర్వహణ ప్రదేశములు శానిటైజ్డ్ గా ఉంచుకొనవాల్సినదిగా సూచించారు. 

   ఆలయములో ఏ ప్రదేశములోనైనా అపరిశుభ్రత కనిపించిన యెడల వెంటనే శానిటేషన్ యొక్క ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ నందు గానీ లేదా ఆ ప్రదేశపు శానిటేషన్ సిబ్బంది/ సూపర్వైజర్ వారికి సమాచారం అందజేయవలసినదిగా తెలిపారు.

Comments