వకుళ మాత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మరియు మహా సంప్రోక్షణ: విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి23 న వకుళ మాత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మరియు మహా సంప్రోక్షణ:  విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి


తిరుపతి, జూన్ 18 (ప్రజా అమరావతి): టీటీడీ మరియు అందరి సహకారంతో వకుళ మాత ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ పర్యావరణ అటవీ,భూగర్భ గనులు శాఖ  మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు.


 శనివారం సాయంత్రం వకుళమాత ఆలయం వద్ద టీటీడీ జె ఈ ఓ వీరబ్రహ్మం తో కలిసి వకుళ మాత ఆలయ అభివృద్ధి పై మీడియా సమావేశం నిర్వహించారు.


 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో వందల సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న వకుళ మాత ఆలయాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  గారికి  సూచించడంతో టిటిడి అధికారులతో మాట్లాడి ఒప్పించడం జరిగిందనీ అన్నారు.


టిటిడి వారు చాలా సంవత్సరాల పాటు కోర్టుల్లో పోరాడారనీ, హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు న్యాయ పోరాటం సాగింది అన్నారు.

దాదాపు 40 సంవత్సారాలు పోరాటం అనంతరం టిటిడి  విజయం సాధించిందనీ, వకుళ మాత ఆలయం పునః నిర్మించే బాధ్యత తీసుకోవాలి అనుకున్నానని తెలిపారు. నిర్మాణ పనులు అన్నీ చాలా తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ సమయంలో అనేక సమస్యలు అధిగమించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

వకుళ మాత ఆలయ నిర్మాణానికి ఎంతో మంది సహకారం అందించారనీ అన్నారు.అందుకే ఇంత గొప్పగా ఈ దేవాలయాన్ని నిర్మించు కోగలిగామని తెలిపారు.


ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో  తిరుమల, శ్రీశైలం లో మాత్రమే బంగారు గోపురాలు ఉన్నాయనీ, ఇపుడు మూడో  దేవాలయం గా శ్రీ వకుళ మాత ఆలయం నిలుస్తుంది అన్నారు.


భవిష్యత్ లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టామని, 83.41 ఎకరాలు భూమి ఆలయ విస్తరణ కోసం అందించామని తెలిపారు.


తిరుచానూరు, మంగాపురం లో స్థలం తక్కువగా ఉండటం వలన అనేక ఇబ్బందులు ఉన్నాయని తెలుపుతూ, ఇక్కడ స్థలం ఎక్కువగా ఉంది కాబట్టి రాబోవు కాలంలో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ టీటీడీ వారు కళ్యాణ మండపాలు, సత్రాలు నిర్మిస్తారని ఆశిస్తున్నాననీ అన్నారు.


సిఎం గారి సూచనలతో ఈ దేవాలయం నిర్మాణం సాగిందని అమ్మవారి ఆశీస్సులు ప్రజందరిపై  ఉండాలని కోరుకుంటున్నాననీ తెలిపారు. 18 వ తేదీ నుండి 23 వరకు వివిధ పూజ కార్యక్రమాలు నిర్వహించ బడతాయి అని తెలిపారు. టీటీడీ పి ఆర్ ఓ రవి, జిల్లా పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.Comments