మనసు పెట్టి స్పందన గ్రీవెన్స్ లకు పరిష్కారం చూపించాలి

 మనసు పెట్టి స్పందన గ్రీవెన్స్ లకు పరిష్కారం చూపించాలి*

వినతులపరిష్కారంలో జాప్యం తగదు


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా),  జూన్27 (ప్రజా అమరావతి):


*స్పందన గ్రీవెన్స్ అర్జీలకు మనసు పెట్టి పరిష్కారం చూపించాలని, ఇప్పుడు వచ్చిన అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. 


*స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్  బసంత కుమార్ స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 198 అర్జీలను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. స్పందనలో జిల్లా కలెక్టర్ తోపాటు డిఆర్ఓ  గంగాధర్ గౌడ్,  పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

          ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ స్పందన కార్యక్రమంలో ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. అందిన దరఖాస్తులు మరల అదే అంశంపై  రీ ఓపెన్ కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఒకవేళ దరఖాస్తులు రీ ఓపెన్ అయిన యెడల ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరిస్తూ  నాణ్యతతో పరిష్కార మార్గాలు స్పష్టతతో పూర్తి స్థాయిలో చూపాలని ఆదేశించారు .  వివిధ మండల కేంద్రాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో  అధికారులు ఆయా నియోజకవర్గ/ మండల పరిధిలో  ప్రభుత్వ ప్రాధాన్య సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపట్ల జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు. 


ఈరోజు స్పందన కార్యక్రమం  కొన్ని  వినతులు

1. రొద్దం మండలం జక్కలచెరువు గ్రామానికి చెందిన ఈ లక్ష్మీపతి అను నేను2.45 ఎకరాల పొలము నందు కంది పంటను సాగు  చేస్తున్నాను. నాకు ఇప్పటివరకు రైతు భరోసా ద్వారా పి ఎన్ కిషన్ మరియు క్రాప్ ఇన్సూరెన్స్   అందలేదు. కావున నాకు మంజూరు చేయవలసిందిగా  వినతులు అందజేశారు.

2.  తనకల్లు మండలం ఉలవల వాండ్ల పల్లి నివసించు కె అనిత రాణి అను నేను మూడు ఎకరాల 8 సెంట్లు భూమి ఉన్నది మాకు పట్టాదార్ పాస్ బుక్ మంజూరు చేయవలసిందిగా వినతులు అందజేశారు.

3  నల్లమడ మండలం నల్లమడ  నివసించుచున్నాను నేను వికలాంగుడిని సదరం సర్టిఫికెట్ నందు పర్సంటేజ్ తక్కువగా ఉన్నందున నాకు పింఛన్ మంజూరు కాలేదు. సదరన్ ఐడి నెంబర్ ను తొలగించి మరల నాకు అవకాశం  ఇవ్వవలసిందిగా వినతులు అందజేశారు.

  ఈ కార్యక్రమంలో  డిఆర్డిఎ పిడి నరసయ్య, హౌసింగ్ అధికారి చంద్రమౌళి రెడ్డి, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు.


 

Comments